Krithi Shetty: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా తలకిందులు అవుతాయి ఎవరికి తెలియదు. అనుకోని విధంగా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిన హీరో హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీల తలరాతలను థియేటర్ మారుస్తుందని చెప్పాలి.
ఈ విధంగా ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అనంతరం వరస రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది.ఇలా ఈమె నటించిన వరుస మూడు సినిమాలు హిట్ కావడంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇలా వచ్చిన అవకాశాలన్నింటినీ ఈమె ఉపయోగించుకొని వరుస సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన నాలుగవ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఒక్కసారిగా బేబమ్మ షాక్ అయింది.
ఇలా ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె కెరియర్లో మొదటి ఫ్లాప్ పడింది.ఈ సినిమా తర్వాత నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు పడటంతో ఈమె కెరియర్ ఇబ్బందులలో పడుతుందని పలువురు భావించారు.
Krithi Shetty: ఇబ్బందులలో బేబమ్మ కెరియర్..
ఇలా తాను నటించిన సినిమాలు హిట్ కావడం కోసం పలు దైవ దర్శనాలు చేసుకున్న బేబమ్మకు మరోసారి థియేటర్ వద్ద చేదు అనుభవమే మిగిలిందని చెప్పాలి. తాజాగా ఈమె హీరో సుధీర్ బాబు సరసన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో వరుసగా మూడవసారి కృతి శెట్టి కెరియర్లో ఫ్లాప్ సినిమా పడిందని చెప్పాలి.ఇలా ఈమె నటించిన వరుస మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో తదుపరి ఈమెకు అవకాశాలు కూడా రావడమే గగనమని పలువురు భావిస్తున్నారు. మరి బేబమ్మ కెరియర్ భవిష్యత్తులో హీరోయిన్ గా కొనసాగాలంటే అర్జెంటుగా ఈమెకు ఒక హిట్టు పడితే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని పలువురు భావిస్తున్నారు.