Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేయడమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేశారు.ఇలా సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కృష్ణంరాజు చివరి వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు.
కృష్ణంరాజు 83 సంవత్సరాల వయసులో కూడ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. తన ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను చేయడమే కాకుండా ఎన్నో అవార్డులు పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీకి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి కృష్ణంరాజు గారు నేడు మన మధ్యన లేరు.ఇక ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆయన చివరి చూపు కోసం తరలివచ్చింది.
ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఈయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కమెడియన్ సునీల్ సైతం కృష్ణంరాజు పార్తివదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారు నన్ను తోడు పుట్టిన వారిలా చూశారు. ఆయన మరణం నన్ను ఎంతగానో బాధపెడుతోంది ఆయన సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా రాయల్ గా బతికారు.నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. ఆయనకు ఇవే నా నివాళులు అంటూ రాజేంద్రప్రసాద్ కృష్ణంరాజు గారితో ఉన్నాను బంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Krishnam Raju: రాజకీయాలలో ఆయన రాయల్ గా బ్రతికారు
ఇకపోతే కమెడియన్ సునీల్ సైతం కృష్ణంరాజు గారి చివరి చూపు కోసం ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సునీల్ కృష్ణంరాజు గారి గురించి మాట్లాడుతూ ఆయన మాలాంటి వారికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. రాజంటే ఒక క్యాస్ట్ కాదు అది ఒక బాధ్యత గల పోస్ట్. ఇలా ఈయన ఒక రాజుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు. ఇండస్ట్రీలో ఎంతోమంది బాగోగులు చూసుకున్నారు. ఇలా చర్చ పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసిన కృష్ణంరాజు గారు మన మధ్య లేకపోవడం బాధాకరం ఆయనకు ఇవేనా నివాళులు అంటూ సునీల్ నివాళులు అర్పించారు.