Krishnam Raju Passed Away: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో నేడు కన్నుమూశారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగినటువంటి కృష్ణంరాజు ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగాను అలాగే విలన్ పాత్రలలోనూ నటించి మెప్పించారు. ఇక ఈయన తుది శ్వాస విడిచే వరకు సినిమాలలో నటిస్తూ సినిమాపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇలా చివరి క్షణం వరకు సినిమాలలో నటించినటువంటి ఈయన నేడు మన మధ్యన లేకుండా వెళ్ళిపోయారు.
ఇక ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కృష్ణంరాజు మృతి పై స్పందిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతూ తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో దర్శకుడు వివి వినాయక్, నటుడు నరేష్, మహేష్ బాబు, కృష్ణ వంటి వారు కృష్ణంరాజు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు గారి మరణ వార్త పై స్పందిస్తూ కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ రోజు నాకు చిత్ర పరిశ్రమకు బాధాకరమైన రోజు. కృష్ణం రాజుగారు సినిమాలలో పనిచేసిన విధానం సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ఇక నేడు మన అందరిని విడిచి వెళ్లిపోయిన కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.ప్రభాస్ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మహేష్ బాబు కృష్ణంరాజు మృతి పట్ల స్పందిస్తూ తన సానుభూతి ప్రకటించారు.
Krishnam Raju Passed Away: మా ఇద్దరిదీ 50 ఏళ్ల స్నేహం.
ఇకపోతే తన మిత్రుడు సహనటుడు కృష్ణంరాజు మృతి పట్ల నటుడు కృష్ణ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ కృష్ణంరాజు మృతి పై స్పందిస్తూ మా ఇద్దరిదీ 50 ఏళ్ల స్నేహం. మేమిద్దరం కలిసి మొదటిసారి తేనె మనసులు సినిమా ఆడిషన్స్ కోసం ఇద్దరు వెళ్ళాం అయితే ఆ సినిమాకు తాను ఎంపిక అయ్యానని అనంతరం చిలక గోరింక సినిమాతో కృష్ణంరాజు ఇండస్ట్రీకి వచ్చారని కృష్ణ వెల్లడించారు.ఈ సినిమా తర్వాత నేనంటే నేను అనే సినిమాలో మొదటిసారి కృష్ణంరాజుతో కలసి నటించానని అయితే అందులో కృష్ణంరాజు విలన్ పాత్రలో నటించారని ఈ సందర్భంగా కృష్ణ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల గురించి గుర్తుచేసుకొని బాధపడుతూ తన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో నిజంగానే రాజు లాంటి జీవితం అనుభవించిన కృష్ణంరాజు నేడు మన మధ్య లేకపోవడంతో ఎంతోమంది అభిమానులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు