krishnam Raju Passed Away: టాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు నేడు ఉదయం అనారోగ్య సమస్యతో మృతి చెందారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు ఏఐజి హాస్పిటల్ లో చేరడంతో ప్రభాస్ కూడా నిన్న సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి తన పెదనాన్నను పరామర్శించారు.
హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో నేడు తెల్లవారుజామున 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణంరాజు మరణ వార్తతో ప్రభాస్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా విలన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించిన కృష్ణంరాజు తుది శ్వాస వరకు సినిమాలలో నటిస్తూ వచ్చారు.
krishnam Raju Passed Away: ఇండస్ట్రీకి తీరని లోటు…
1940 జనవరి 20 న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఇలా సినిమాపై మక్కువతో మొదటిసారిగా చిలకా గోరింక అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఈయన ఎన్నో సినిమాలలో హీరో గాను, విలన్ పాత్రలలోనూ నటించి మెప్పించారు. ఇలా నటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన నేడు తుది శ్వాస విడిచారు. ఇక ఈయన చివరిగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నటించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామల దేవి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇక ఈయన మరణ వార్త తెలిసిన చిత్ర పరిశ్రమ ఈయన మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.