తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోలు వచ్చిన అతి కొద్ది మంది మాత్రమే స్టార్ హీరోలుగా ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఒకరని చెప్పాలి. తాజాగా ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రతి ఒక్కరి గుండెల్లో కృష్ణంరాజు నటించిన చిత్రాల ద్వారా ఎప్పటికి గుర్తుండిపోతారు. టాలీవుడ్ లో అరుదైన ఘనతని ఆయన సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అంటే ప్రతి ఒక్కరు మాస్ కమర్షియల్ అనే జోనర్ లో మొ మూవీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ జోనర్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది అంటే కృష్ణంరాజు అని చెప్పాలి. నాలుగు దశాబ్దాల క్రితమే మాస్ యాక్షన్ హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు.
రెబల్ స్టార్ అనే గుర్తింపు అతనికి రావడానికి కారణం కూడా మాస్ మసాలా మూవీస్ అని చెప్పాలి. సినీ ప్రస్తానంలో 190 చిత్రాలలో ఆయన నటించారు. అందులో చాలా వరకు హీరోగా చేసినవే. చిలకాగోరింక అనే సినిమాతో 1966లో హీరోగా తెరంగేట్రం చేసిన కృష్ణం రాజు కెరియర్ ఆరంభంలో విలన్ పాత్రలతో పాటు, సైడ్ రోల్స్ కూడా చేశారు. తరువాత, హిస్టారికల్, సాంఘికం, పౌరాణికం, జనపథం అంటూ అన్ని రకాల జోనర్స్ లో అతను చిత్రాలు చేశాడు. ఎన్‌టి రామారావు తో కలిసి శ్రీ కృష్ణావతారంలో నటించారు. అలాగే అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అందరితో జత కట్టాడు. కెరియర్ ఆరంభంలో కాస్తా సాఫ్ట్ పాత్రలతో బుద్ధిమంతుడు, జై జవాన్, అనురాధ, భాగ్యవంతుడు, బంగారు తల్లి వంటి చిత్రాలలో నటించాడు. బడి పంతులు , బాల మిత్రుల కథ , జీవన తరంగాలు , కన్న కొడుకు వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కృష్ణంరాజు నటించి మెప్పించారు.
తరువాత రంగూన్ రౌడీ, త్రిసూలం, మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, యుద్ధం, బెబ్బులి, కటకటాల రుద్దయ్య, సింహస్వప్నం, పులి బెబ్బులి, అడవి సింహాలు, పల్నాటి పౌరుషం, తిరుగుబాటు, రగిలేజ్వాల వంటి మాస్ మసాలా మూవీస్ చేసి రెబల్ స్టార్ అనే బిరుదు తెచ్చుకున్నారు. ఆయన నటించిన మాస్ మూవీస్లో బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయే మూవీస్, అలాగే బయోపిక్ ట్రెండ్ అంటే తెలియని రోజుల్లో తాండ్ర పాపారాయుడుతో బయోపిక్ మూవీలో కూడా ఆయన నటించి సూపర్ హిట్ కొట్టారు. కృష్ణం రాజు సొంత నిర్మాణ సంస్థ గోపీ కృష్ణ మూవీస్‌ను స్థాపించి దానిపై పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. స్వయంగా నటించి నిర్మించిన కృష్ణవేణి సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది.
భక్త కన్నప్ప సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. హీరోగా కెరియర్ ముగించిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. తన మనసుకి దగ్గరైన పాత్రలని ఎంపిక చేసుకొని కృష్ణంరాజు సినిమాలు చేయడం విశేషం. కృష్ణంరాజు పాత్రలో గంభీరం, ధీరత్వం కనిపిస్తాయి. ఈ కారణంగానే అప్పటి దర్శకులు ఎక్కువగా మాస్ సినిమాలనే అతనితో తెరకెక్కించి హిట్స్ కొట్టారు. ఆయన చివరిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాలో గురూజీ పాత్రలో నటించి మెప్పించాడు. బాలీవుడ్ హీరోయిన్ రేఖతో నటించిన ఒకే ఒక్క తెలుగు హీరో కృష్ణంరాజు మాత్రమే. అలాగే అతనికి జోడీగా జయసుధ, జయప్రద ఎక్కువ సినిమాలు నటించారు. మాస్ హీరోగా చిరంజీవి కంటే ముందుగానే కృష్ణంరాజు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇలా సుదీర్ఘ సినీ ప్రస్తానంలో ఎన్నో మైలు రాళ్లు కృష్ణం రాజు అధికమించాడు.