Krishnam Raju: టాలీవుడ్ నటుడు రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయింది.ఈయన మరణ వార్త తెలియగానే తారాలోకం ఆయన నివాసానికి చేరుకొని కృష్ణంరాజుకు ఘన నివాళి అర్పించారు. ఈయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవలు చేశారు. కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి కృష్ణంరాజు మరణం తెలుసుకొని పలువురు రాజకీయ నాయకులు కూడా ఈయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఇలా కృష్ణంరాజు మరణ వార్తపై ఎంతోమంది స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇకపోతే ఈరోజు ఉదయం ఈయన పార్టీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించి అక్కడ అభిమానుల సందర్శనార్థం కొంతసేపు ఉంచిన అనంతరం ఈయన అంతిమయాత్ర మొదలవుతుంది. ఇక ఫిలిం చాంబర్ నుంచి ఈయన పార్తివదేహాన్ని మహాప్రస్థానంకి తరలించి అక్కడ ఈయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.ఇక ఈయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారక లాంచనాలతో నిర్వహించనున్నట్లు తెలిసింది.
ఇక కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ఉప్పలపాటి ప్రబోద్ చేతుల మీదుగా జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభాస్ వరకు మాత్రమే మనకు తెలుసు అయితే ఈయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారని ఆయన సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటూ వ్యాపార రంగాలలో బాగా సక్సెస్ అయ్యారు. అయితే ఈయన యువి క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలకు ఫైనాన్షియల్ గా వ్యవహరించారు. ఇలా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రబోధ్ గురించి చాలామందికి తెలియదు.
Krishnam Raju: వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ప్రబోద్
ఇక ఈయన ప్రభాస్ కి అన్నయ్య అవుతారు. ఇక ఈయన చేతుల మీద గానే నేడు మహాప్రస్థానంలో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఇక కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు కాగా తన తమ్ముడి కుమారులను ఆయన వారసులుగా భావించారు. ఈ క్రమంలోనే తన వారసుడిగా ప్రభాస్ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలో కొనసాగుతూ తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ ఎదుగుదలను చూసిన కృష్ణంరాజు ఎంతో ఉప్పొంగిపోయారు. అయితే అనారోగ్య సమస్యలతో ఈయన తుది శ్వాస విడిచారు.