Krishnam Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు కృష్ణంరాజు. 1996లో చిలకా గోరింకా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన రాధే శ్యామ్ చిత్రంలో చివరిగా నటించారు. ఇలా తన సినీ కెరియర్లో సుమారు 180 సినిమాలకు పైగా నటించిన ఈయన తన వారసుడిగా ప్రభాస్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కృష్ణంరాజు అల్లుడు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
కృష్ణంరాజు మొదట సీతాదేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరికి పిల్లలు లేకపోవడంతో కృష్ణంరాజు దంపతులు ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు ఆ అమ్మాయి పేరు ప్రశాంతి.ఇలా ప్రశాంతి అనే అమ్మాయిని దత్తత తీసుకున్న తర్వాత కృష్ణంరాజు భార్య సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతరం కృష్ణంరాజు తన కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో శ్యామలాదేవిని రెండవ వివాహం చేసుకున్నారు.
ఇలా శ్యామలాదేవికి ముగ్గురు కుమార్తెలు జన్మించినప్పటికీ ప్రశాంతిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచారు. ఇక ప్రశాంతిని కృష్ణంరాజు తన మేనల్లుడికి ఇచ్చే వివాహం చేశారు. అయితే కృష్ణంరాజు మేనల్లుడు మరెవరో కాదు అతని పేరు నరేంద్రనాథ్ ఆయన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నరేంద్రనాథ్ ప్రభాస్ నటించిన బిల్లా రెబల్ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
Krishnam Raju: నిర్మాతగా పేరుపొందిన కృష్ణంరాజు అల్లుడు..
ఇలా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగడమే కాకుండా మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలలో కూడా నరేంద్రనాథ్ ముందుండి అన్ని కార్యక్రమాలను పూర్తి చేశారు. ప్రశాంత్ నరేంద్రనాథ్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు కలరు. ఈ విధంగా కృష్ణం రాజు అల్లుడు కూడా ఇండస్ట్రీకి చెందినవారు అనే విషయం బహుశా చాలామందికి తెలియక పోయి ఉండవచ్చు.