Krishnam Raju: ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్రమంత్రిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు. ఈయన 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. నటనపై ఆసక్తి ఉన్నటువంటి ఈయన చిలక గోరింక అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఈ విధంగా ఈయన ఎన్నో సినిమాలలో హీరో గాను విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పించారు.
ఇకపోతే గత కొంతకాలం నుంచి ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందిన విషయం మనకు తెలిసింది.కృష్ణంరాజు మృతి చెందారనే వార్త తెలియగానే ఒక్కసారిగా సినీ ప్రపంచం మొత్తం కదిలి వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అలాగే కృష్ణంరాజు ఇండస్ట్రీకి అందించిన సేవలు గురించి కొనియాడారు.
మంచితనానికి మారుపేరుగా ఉన్నటువంటి కృష్ణంరాజు ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అనలేదని,అందరితో ఎంతో స్నేహభావంగా ఉంటూ ఈ స్థాయికి ఎదిగారని ఎంతోమంది హీరోలు కృష్ణంరాజు మంచితనం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.ఇకపోతే కృష్ణంరాజు మరణించడం తర్వాత ఆయన ఆస్తులు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.కృష్ణంరాజు ఇన్నేళ్ల తన సినీ కెరియర్ లో ఏ మొత్తంలో ఆస్తులు సంపాదించారు ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాల గురించి చర్చలు మొదలవుతున్నాయి.
Krishnam Raju: వందల కోట్ల ఆస్తి సంపాదించడం కృష్ణంరాజు..
కృష్ణంరాజు మొగల్తూరులో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇలా ఆయనకు తన పెద్దల ద్వారా కొంత ఆస్తి కలిసి వచ్చింది అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆస్తులు కూడా బాగా కూడా పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఈయన నివసిస్తున్నటువంటి ఇల్లు 18 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం.ఇక సినిమాలలోకి రాకముందు కృష్ణంరాజు గారి దగ్గర ఏకంగా నాలుగో కిలోల బంగారం ఉందని అయితే ప్రస్తుతం మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉంటుంది తెలుస్తుంది. మోయినాబాద్ లో ఫామ్ హౌస్, హైదరాబాదులోని పలు ప్రాంతాలలో ఖరీదైన స్థలాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన ఆస్తులన్నీ కలుపుకుంటే సుమారు 200 కోట్లకు పైగా ఉంటాయని సమాచారం.ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ సైతం కొన్ని వందల కోట్ల ఆస్తి సంపాదించారని తెలుస్తోంది.