రెబల్ స్టార్ గా సుదీర్ఘ నట ప్రస్థానాన్ని కొనసాగించిన కృష్ణంరాజు ఈ రోజు మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను అందుకొని విజయాలు లేవనే చెప్పాలి. అలాగే రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి కేంద్ర మంత్రిగా కూడా పని చేసి ఆ విధంగా కూడా ఆయన సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం కృష్ణంరాజు ఆశలు తీరలేదని చెప్పాలి. ఆ ఆశ తీరకుండానే ఆయన ఆనారోగ్యంతో మృతి చెందారు. ఓ విధంగా పెదనాన్న చివరి కోరిక తీర్చలేకపోయాను అనే బాధ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి కూడా కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కృష్ణం రాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి తన చేతుల మీదుగా చేయడం.
అలాగే ప్రభాస్ పిల్లలతో కలిసి సినిమాలలో నటించడం. రెండోది సాధ్యం కాకపోయిన మొదటిది మాత్రం సాధ్యమయ్యే అవకాశం ఉండేది. ప్రభాస్ తండ్రి కరోనాకి ముందు చనిపోయారు. ఇక తండ్రి స్థానంలో ప్రభాస్ పెళ్లి చేసే బాద్యతని కృష్ణంరాజు తీసుకున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో అతను చేస్తున్న వరుస సినిమాల కారణంగా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. చాలా రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. అయితే ప్రభాస్ తాత్సారం కారణంగా లేట్ అవుతూ వస్తుంది. బాహుబలి సిరీస్ కోసం ఏకంగా నాలుగేళ్ళు కేటాయించారు. ఆ తర్వాత పెళ్లి ఉంటుందని అందరూ భావించారు. వెంటనే సాహో, తరువాత రాధేశ్యామ్ సినిమాల కోసం మరో మూడేళ్ళ సమయం వెచ్చించారు.
దీంతో ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ మధ్యలో ప్రభాస్ పెళ్లి విషయంలో చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడు అని ప్రచారం జరిగింది. తరువాత తమ బందువులలో ఒక అమ్మాయిని చూసారని కూడా ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఆ పెళ్లి తంతు మాత్రం జరగడం లేదు. కొంత వరకు కృష్ణంరాజులో ఈ బాధ కూడా ఉందనే చెప్పాలి. చాలా కాలంగా ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. చాలా సందర్భాలలో మీడియా ముఖంగానే ఈ విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఎందుకనో ప్రభాస్ కి మాత్రం పెళ్లి విషయంలో ఏదో భయం వెంటాడుతున్నట్లు ఉంది. ఈ కారణంగానే అతను పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపడం లేదనే మాట వినిపిస్తుంది. మొత్తానికి ఈ విధంగా ప్రభాస్ పెళ్లి చూడాలనే కోరిక నెరవేరకుండానే కృష్ణంరాజు మృతి చెందడం విషాదం అనే చెప్పాలి.