తన నటనతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా నవ్విస్తున్న బ్రహ్మానందం వయసు రీత్యా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సినిమాలకు బై చెప్పిన తరువాత కూడా పెయింటింగ్స్ వేస్తూ బిజీ అయిపోయారు.బ్రహ్మానందం తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజును కలిసి తాను వేసిన సాయిబాబా చిత్ర పటాన్ని ఆయనకు బహూకరించారు.దానికి ప్రతిగా కృష్ణం రాజు గారు బ్రహ్మానందం గారిని శాలువాతో సత్కరించారు.
ఈ విషయాన్ని కృష్ణం రాజు గారు స్వయంగా ట్విట్టర్ వేదికగా సినీ అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.