Krishna Vamshi : పాత సినిమాలను రీరిలీజ్ చేసే ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు చాలా వరకు రీరిలీజ్ అయ్యాయి. హారోల పుట్టినరోజున, లేదా మూవీకి సంబంధించి స్పెషల్ అకేషన్ సందర్భంగా 90లో హిట్ కొట్టి బంపర్ కలెక్షన్స్‌ను వసూలు చేసిన సినిమాలను మళ్లీ హై క్వాలిటీతో విడుదల చేస్తున్నారు. అభిమానులు కూడా ఈ రీరిలీజ్ సినిమాలను విశేషంగా ఆదరిస్తున్నారు. అయితే రీసెంట్‌గా సిందూరం మూవీని కూడా అభిమాలు మరోసారి స్క్రీన్ మీద చూడాలనుకుని డైరెక్టర్‌కు ట్వీట్ చేశారు. సార్ మీరూ సిందూరం మూవీని రీరిలీజ్ చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ట్వీట్ కు సంబంధించి కృష్ణ వంశీ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

1997లో సింధూరం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బ్రహ్మాజీ హీరోగా సంఘవి హీరోయిన్‌గా నటించింది. ప్రత్యేకమైన పాత్రలో రవితేజ నటించి తనదైన నటనతో అలరించాడు. వీరితో పాటు భానుచందర్, చలపతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, శివాజీరాజా, అన్నపూర్ణ వంటి సీనియర్ నటులు ఈ మూవీలో ప్రముఖ పాత్రల్లో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో అప్పట్లో నక్సలిజం నేపథ్యంలో వచ్చిన చిత్రం ఇది.

ఈ సినిమాలోని ఆల్‌మోస్ట్ అన్ని పాటలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. సిరివెన్నెల సీతారామశాస్త్ర రచనలు ఆధ్యంతం అందరిని ఉత్తేజపరిచాయి. ముఖ్యంగా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అన్న పాటు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఈ పాటకు గాను సిరివెన్నెలకు ఉత్తమ గీత రచయితగా పురస్కారం కూడా లభించింది. సినిమా కథ, కదనం బాగున్నా , నేషనల్ అవార్డు దక్కినా కమర్షియల్‌గా హిట్ కొట్టాలేదు.

ఈ క్రమంలో మరోసారి అభిమానులు సినిమాను రిలీజ్ చేయమని ట్వీట్ చేయగానే అమ్మో ఐదు సంవత్సరాలు అప్పులు కట్టానయ్యా మళ్లీ రిలీజ్ చేయలేను అని దండం పెట్టేశారు. అయితే కొంత మంది అప్పటి సంగతి ఏమిటో కానీ ఇప్పుడు రిలీజ్ చేయండి సూపర్ హిట్ అవుతుందంటూ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ చేస్తారో లేదు దర్శకుడిపైనే ఆదారపడి ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ రంగమార్తాండ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement