Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 350కిపైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ స్ఫూర్తి అజరామరం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆ ఘనత కృష్ణకు దక్కుతుంది: గవర్నర్ విశ్వభూషణ్
నటుడు, నిర్మాత, దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా… తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ పేర్కొన్నారు. సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశపెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు.
ఆయనే మన అల్లూరి, మన జేమ్స్‌బాండ్: ఏపీ సీఎం జగన్
కృష్ణ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు పాత్రతో చిరస్థాయిగా నిలిచిపోయారని వెల్లడించారు. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్ అని తెలిపారు. నిజ జీవితంలోనూ మనసున్న మనిషి కృష్ణ అంటూ పేర్కొన్నారు. కృష్ణ మరణం తెలుగు సినీరంగానికి, తెలుగువారికి తీరని లోటు వెల్లడించారు. కష్ట సమయంలో కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.
కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి… ఆయనే మన జేమ్స్ బాండ్.
నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. (1/2)— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022
తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు: తెలంగాణ సీఎం కేసీఆర్
అభిమానులు సూపర్‌స్టార్‌గా పిలుచుకునే ఘట్టమనేని కృష్ణ కన్నుమూతపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన కృష్ణ మరణం.. తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (శ్రీ ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.#SuperStarKrishna
— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022
Krishna:
దిగ్భ్రాంతికి గురిచేసింది: చంద్రబాబు
సూపర్‌స్టార్ కృష్ణ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణ చేసిన కృషిని ప్రస్తావించారు. కృష్ణ మరణంతో ఓ అద్భుత సినీశకం ముగిసినట్లందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోవడం మహేశ్‌కు తీరని వేదనేనని.. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యం ఆయన కుటుంబీకులకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు.(1/2) pic.twitter.com/Yl6oZuJTaT
— N Chandrababu Naidu (@ncbn) November 15, 2022