శివన్న సంగతి నేను చూసుకుంటానని సీఐకి మాటిస్తాడు ఏసీపీ మురారి. ఆ తర్వాత కృష్ణ వచ్చి మా నాన్నకు వీఆర్ఎస్ ఇవ్వమని మురారిని అడుగుతుంది. అక్కడ ముకుందకు పెళ్లిచూపులు జరుగుతాయి. తను మురారికి ఎన్ని సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత నవంబర్ 25 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మీరు నాకు చాలా బాగా నచ్చారని చెప్తాడు ఆదర్శ్ ముకుందతో. తన అభిప్రాయాల్ని కాబోయే భార్య దగ్గర ప్రస్తావించాడు. మరోవైపు మురారి గోపికి ఫోన్ చేసి ప్రియురాలి గురించి కనుక్కోమంటూ రిక్వెస్ట్ చేస్తాడు. నా గురించి మీరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అని ఆదర్శ్ అడగ్గా.. ఏం చెప్పదు ముకుంద. మురారికి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది ముకుంద. అందరికీ ఇష్టమైంది కాబట్టి మంచి రోజు చూసి ముహుర్తం పెట్టిద్దాం అంటుంది భవాని. ఆ తర్వాత వెళ్లిపోతారు వారంతా. అక్కడ ముకుంద, ఇక్కడ మురారి ఇద్దరూ బాధపడతాడు. తన ఫ్రెండ్ వచ్చి ముకుందని ఓదారుస్తుంది. తనే నా సర్వస్వం అని ఊహించుకున్నా. ప్రాణం పోవడం కన్నా ఎక్కువ బాధేం ఉంటుంది అని ఎమోషనల్ అవుతుంది ముకుంద. మేం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. అతనికి నేనంటే ప్రాణం అంటుంది ముకుంద. మరి తన నుంచి రిప్లై లేదేంటి అని అడుగుతుంది తన ఫ్రెండ్.
అంతలోనే మురారికి ఎమ్మెల్యే ఫోన్ చేసి శివన్న గురించి చెప్తాడు. ఏసీపీని బెదిరిస్తాడు. మురారి కూడా ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ముకుంద మాట్లాడుతుంటే అపుడే తన అమ్మ నాన్నలు వస్తారు. అతని నుంచి స్పందన లేనపుడు నువ్ అతన్ని గుడ్డిగా నమ్ముతున్నావ్ వాదిస్తారు. ఇపుడే నువ్ ఫోన్ చేసి మాట్లాడు. తను ఫోన్ మాట్లాడితే మీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తాడు ముకుందకు తన తండ్రి. దేవుడిని వేడుకుంటూ ఫోన్ చేస్తుంది ముకుంద. రాజకీయ నాయకుడు అయి ఉంటాడని కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు మురారి. దాంతో ముకుంద షాకవుతుంది. ఆ మాటలకు కుప్పకూలిపోతుంది. తండ్రిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కూతుర్ని ఓదారుస్తాడు తల్లిదండ్రులు. నా తొందరపాటు ఎంత పొరపాటో ఇపుడు అర్థమైంది నాన్నా నన్ను క్షమించడని అంటుంది ముకుంద. కోపంతో మురారి నెంబర్ బ్లాక్ చేస్తుంది. అపుడే గోపి ఫోన్ చేసి నీ లవర్ ఫోన్ నెంబర్ పట్టానురా అని చెప్తాడు మురారితో. ఆనందంతో పొంగిపోతాడు మురారి. వెంటనే కాల్ ట్రై చేస్తాడు కానీ బిజీ బిజీ అని వస్తుంది. పక్కన ఎవరైనా ఉన్నారేమోనని ఊరుకుంటాడు మురారి.
సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా వెళ్తున్న కృష్ణని ఏడిపిస్తాడు శివన్న. తనతో దురుసుగా ప్రవర్తిస్తాడు. నీ మెడతో తాళి కడతానంటూ బెదిరిస్తాడు. అంతలోనే ఏసీపీ మురారి అక్కడికి చేరుకుంటాడు. ఏరా తనని ఇబ్బంది పెట్టి ఏడిపిస్తున్నావా? అంటూ ప్రశ్నిస్తాడు శివన్నని మురారి. నేను తనని ముట్టుకోలేదు పట్టుకోలేదు ఎలా ఏడిపిస్తున్నట్టు చెప్పండి సార్ అంటాడు శివన్న. మాట్లాడి ఏడిపించడం కూడా తప్పేనంటాడు ఏసీపీ. నేను మా ఊరి అమ్మాయితో మాట్లాడాను అంతే నంటూ ఏసీపీనే ఆటపట్టిస్తాడు శివన్న. ఆ తర్వాత మురారి చంద్రశేఖర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..