నిన్నటి ఎపిసోడ్‌లో మురారి జాబ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ సీఐగా ఉన్న తన గురువు చంద్రశేఖర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత శివన్న వచ్చి ఏసీపీని పరిచయం చేసుకుంటాడు. తనకు లొంగిపోతాడనుకున్న శివన్న ప్లాన్ బెడిసికొడుతుంది. కానీ ముకుంద మొత్తం చూడకుండా మధ్యలోనే వెళ్లిపోతుంది. ఆ తర్వాత నవంబర్ 23 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఇంటికెళ్లిన ముకుందకు తన పేరేంట్స్ పెళ్లి ప్రపోజల్ చేస్తారు. తను ప్రేమించిన మురారి గురించి చెప్పే అవకాశం కూడా ఇవ్వరు. దాంతో తప్పక పెళ్లికి ఒప్పుకుంటుంది ముకుంద. ఆ తర్వాత దిగులుగా ఉన్న ముకుందను ఏమైందని గుచ్చి గుచ్చి అడుగుతుంది తల్లి. చివరకు మురారి గురించి చెప్పేస్తుంది ముకుంద. అతని పేరేంటని అడగ్గా.. తెలియదమ్మా అంటుంది ముకుంద. తనకు సంబంధించిన వివరాలేవీ అడిగిన తెలియదని అంటుంది ముకుంద. దీన్ని పిచ్చితనం అంటారు అంటూ కూతుర్ని తిడుతుంది తల్లి. మీ మధ్య ఉన్నది ప్రేమ కాదు కేవలం పరిచయం అని చెప్తుంది. కానీ ముకుంద తల్లి మాటలతో ఏకీభవించదు. తన మీద నమ్మకం ఉందని రెండ్రోజులు టైం ఇవ్వమని తల్లిని వేడుకుంటుంది. వస్తే సరే కానీ లేకపోతే మేం నిర్ణయించిన పెళ్లి చేసుకోవాలని కూతురికి హితబోధ చేస్తుంది తల్లి.
ఆ తర్వాత మురారిని ఊహించుకుంటూ ముకుంద ఎదురుచూస్తుంటుంది. అక్కడ మురారి కూడా తనని తలుచుకుంటూ బాధపడతాడు. మరోవైపు తన ప్రియుడి గురించి గొప్పగా చెప్పుకుంటుంది ముకుంద స్నేహితురాలితో. మీ ప్రేమ గెలవాలని కోరుకుంటుంది తన స్నేహితురాలు. ప్రేమంటే నూరేళ్ల బాధ్యత కాబట్టి అతడు నాకు చేసే ఫోన్ వల్ల ఇప్పుడే అర్థమవుతుంది అని వివరిస్తుంది ముకుంద. ఒక ఫ్రెండ్‌గా నీ ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అంటుంది ముకుంద ఫ్రెండ్.
కానిస్టేబుల్ దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని గోపికి ఫోన్ చేస్తాడు మురారి. నేను నీకు చెప్పిన పని ఎంత వరకు వచ్చిందని అడుగుతాడు. పదినిమిషాల్లో నాకు నెంబర్ చెప్పాలని ఆదేశిస్తాడు మురారి గోపిని. నువ్ ప్రశాంతంగా ఉండు నేను నెంబర్ తెలుసుకుంటానని హామీ ఇస్తాడు గోపి. వెంటన్ రిసార్ట్‌కు ఫోన్ చేసి ముకుంద నెంబర్ ఇవ్వమని అడుగుతాడు. అలా ఇవ్వడం కుదరదని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రిసెప్షన్.
సీన్ కట్ చేస్తే.. మురారి బొమ్మను డ్రా చేస్తుంది ముకుంద. అక్కడ కృష్ణ వీఆర్ఎస్ గురించి ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావని చంద్రశేఖర్ అడగ్గా.. మీ వీఆర్ఎస్ గురించే అంటుంది కృష్ణ. ఆ ఏసీపీ మంచివాడు కాదని కృష్ణ చెప్పగా.. తన గురించి నాకు బాగా తెలుసని అంటాడు చంద్రశేఖర్. తన సంస్కారం, మంచితనం గురించి కృష్ణకు చెప్తాడు చంద్రశేఖర్. నాన్న ఏం చేసినా.. ఏం చెప్పినా నిజమై ఉంటుంది. మరోసారి ఏసీపీని కలిసి నిజమేంటో తెలుసుకుందాం అంటుంది కృష్ణ సుందరితో.
మీ మెుబైల్ రిపేర్ చేయించానంటూ కానిస్టేబుల్ మురారికి ఫోన్ ఇస్తాడు. ఆ తర్వాత సీఐ ఎక్కడా అని అడగ్గా పదినిమిషాల్లో వస్తాడంటూ బదులిస్తాడు కానిస్టేబుల్. ఆ తర్వాత శివన్న గురించి ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. అపుడు కానిస్టేబుల్ ఆ శివన్న మన సీఐ గారి అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడని జరిగిందంతా చెప్తాడు. అతడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని అంటాడు మురారి. మరి శివన్నని మురారి ఏం చేస్తాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..