నేటి ఎపిసోడ్‌లో మురారి తన ఫ్రెండ్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్తాడు. అక్కడ జంటగా డ్యన్స్ చేయాలని తన ఫ్రెండ్ చెప్పగా ముకుందనే గుర్తు చేసుకుంటాడు మురారి. తను నాకు ఫ్రెండ్ మాత్రమే జంట కాదని అంటాడు. తలుచుకోగానే ముకుంద కూడా అక్కడికి వస్తుంది. అక్కడ నిర్వహించిన ఓ గేమ్‌లో ఇద్దరూ పాల్గొంటారు. ఆ ఆటలో కూడా మురారి ముకుందలే ఒకరికొకరు ఎదురుపడతారు. ఆ తర్వాత మురారి ముకుందను నీకేం ఇష్టమని అడగ్గా.. ఫొటోగ్రఫి, నేచర్, అనిమల్స్ అని చెప్తుంది. నీకేం ఇష్టమని అడగ్గా.. నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టమని చెప్తాడు మురారి. ఇంతమందిలో మనం కలవడం గ్రేట్ అంటాడు మురారి. ఆ తర్వాత పార్టీలో మీలో ఉన్న కలల్ని ఇక్కడ చూపించవచ్చని యాంకర్ చెప్పగా ఒకమ్మాయి వెళ్లి పాట పాడుతుంది.
ఆ తర్వాత మరోజంట కూడా వెళ్లి తమ ప్రదర్శన చూపిస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. ముకుంద వెళ్తుంది. మురళీ గానాన్ని అందించే వ్యక్తి మన మధ్యలో ఉన్నాడని ముకుంద చెప్తుంది. తనని వేదిక మీదికి రమ్మని పిలుస్తుంది ముకుంద. ఫ్లూట్ వాయించడం సరదాగా చేస్తుంటా అంటాడు మురారి. తన దగ్గరే ఉండిపోయిన ఫ్లూట్‌ని మురారికి ఇస్తుంది ముకుంద. కమాన్ ప్లే అనగా మీకోసం అంటూ మొదలెడతాడు మురారి. అలా మురారి ఫ్లూట్ వాయిస్తుండగా ముకుంద డాన్స్ చేస్తుంది. అలా వారిద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది. ఇద్దరూ తమలోని భావాలను మనసులోనే ఒకరితో ఒకరు పంచుకుంటారు. అలా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు చెప్పుకుంటారు.
సీన్ కట్ చేస్తే.. మరుసటి రోజు ముకుంద, మురారిలు ఓ ఏకాంత ప్రదేశంలో కలుసుకుంటారు. ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. నేను మిమ్మల్ని.. నేను మిమ్మల్ని.. అని మనసులో మాట చెప్పబోతుండగానే పెద్దమ్మ ఫోన్ అంటూ పిలుస్తాడు. దాంతో నేను వెళ్లాలి అనుకుంటూ బయల్దేరతాడు మురారి. శ్రీకృష్ణ అని ముకుంద పిలవగా వెనక్కు వచ్చి తన చేతిలో ఫోన్ నెంబర్ రాసి వెళ్లిపోతాడు. సగం దూరం వెళ్లిన తర్వాత శ్రీకృష్ణ అనుకుంటూ వెళ్లి ఓ చీటిని తన చేతిలో పెడుతుంది ముకుంద. ఇది కాగితం కాదు నా మనసని చెప్పి నీకోసం ఎదురు చూస్తుంటా అంటుంది. నీకోసం తప్పకుండా తిరిగివస్తా రాధా అని చెప్పి వెళ్లిపోతాడు మురారి.
ఆ తర్వాత సీన్‌లో ముకుందాకు తన పెద్దమ్మ భవాని ఫోన్ చేస్తుంది. నువ్ వెంటనే వెళ్లి జాబ్‌లో చేరాలని సూచిస్తుంది. మురారి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకో. మన కుటుంబం సమాజం కోసం ఎంత సేవ చేసిందో గుర్తుంచుకో. మీ పెద్దనాన్న, మీ నాన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఏ చిన్న రిమార్క్ లేకుండా నిజాయితీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేస్తుంది. ప్రతిక్షణం ప్రజలకోసం సేవచేయాలని మురారికి హితబోధ చేస్తుంది. వృత్తిధర్మాన్ని కాపడాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. తప్పకుండా పెద్దమ్మ అంటూ మాటిస్తాడు మురారి. ఆ తర్వాత ముకుంద ఇచ్చిన ఉత్తరాన్ని చదువుతాడు మురారి. తనని ప్రేమిస్తున్నానని ముకుంద అందులో రాస్తుంది. అంతలోనే గాలికి లెటర్ ఎగిరిపోయి లోయలో పడిపోతుంది. దాంతో మురారి తన ప్రియురాల్ని గుర్తుచేసుకుంటూ కుంగిపోతాడు. నో అంటూ అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం..