గుంటూరు జిల్లాలోని వేమూరులో మిడిల్ క్లాస్ వైశ్యుల కుటుంబంలో జులై 4వ తేదీన 1933న రోశయ్య గారు జన్మించారు.గుంటూరులోని హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.
1950 లో శివలక్ష్మి గారిని రోశయ్య గారు వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉంది.
చదువుకునే రోజులలో రోశయ్య గారు స్టూడెంట్ లీడర్ గా ఎన్నికయ్యారు.అప్పటి నుండి ఆయన అడుగులు రాజకీయాల వైపు పడ్డాయి.స్వతంత్ర సమరయోధుడు స్వతంత్ర పార్టీ నాయకుడైన ఎన్.జి రంగా రాజకీయ వారసుడిగా రోశయ్య గారి ప్రస్థానం మొదలైంది.
1968,1974,1980,2009 లలో ఎమ్మెల్సీగా,1989,2004లో ఎమ్మెల్యేగా చీరాల నుండి,1998లో నరసరావుపేట నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.
రోశయ్య గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 1994 నుండి 1996 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు.
ఈయన రోడ్డు రహదార్లు,హౌసింగ్,ఆర్థిక,రవాణా,విద్యుత్,ఆర్థిక, వైద్య,ఆరోగ్యం,హోమ్ శాఖ,ప్రణాళిక & శాసన వ్యవహారాలు పోర్టుఫోలియోస్ ను నిర్వహించారు.
ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న సమయంలో రోశయ్య గారు దాదాపు 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.అందులో వరసగా ఏడుసార్లు ఈయన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ రికార్డ్ ఇప్పటికే రోశయ్య గారి పేరు మీదే ఉంది.
వై.ఎస్.ఆర్ మరణాంతరం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని చక్కబరిచేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పద్నాలుగు నెలలు పని చేశారు ఇంతటి గడ్డు సమయంలో సైతం రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపకుండా విజయవంతంగా కొనసాగించారు.
తెలుగు రాష్ట్ర ప్రజలకే కాక ఈయన కర్ణాటక,తమిళనాడుకు గవర్నర్ గా పని చేసి అక్కడి వారికి కూడా సేవలు అందించారు.