Komati Reddy: తెలంగాణలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. ఎన్నికలో పంచిపెట్టడానికి, ఓటర్లను లొంగదీసుకోవడానికి భారీగా ఈ డబ్బును వినియోగించే అవకాశం ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో జరిగే అతి ఖరీదైన ఎన్నికగా మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ లో కోకాపేట్ నుండి నార్సింగ్ వెళుతున్న రెండు కార్లలో దాదాపు కోటి రూపాయలు పోలీసులకు పట్టుబడ్డాయి. రెండు కార్లలో ఐదురుగు వ్యక్తులు ఈ నగదును తరలిస్తుండగా.. నార్సింగ్ పోలీసులు పట్టుకున్నారు. డబ్బు ఎక్కడిది, ఎవరివి అని పోలీసులు విచారిస్తుండగా.. కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ లకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.
కార్లలో డబ్బును తరలిస్తున్న వ్యక్తులు తాము ఈ డబ్బును కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్య పవన్ లకు ఇవ్వడానికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారని, వారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హవాలా డబ్బు వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారని పోలీసులు విచారణ చేస్తున్నారు.
Komati Reddy:
తెలంగాణలో కాకరేపుతున్న మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఈ హవాలా డబ్బు ఎక్కువగా పట్టుబడుతుండటం, తాజాగా కోటి రూపాయల డబ్బుకు సంబంధించి వెల్లడైన పేర్లకు నల్గొండ జిల్లాకు సంబంధం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికలో పంచడానికి ఈ డబ్బు వెళుతోందని అనుమానిస్తున్న పోలీసులు.. దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు.