రజినీకాంత్ అల్లుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉంది.అందుకే ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వస్తుంటాయి.దీన్ని దృష్ఠిలో ఉంచుకొని తెలుగులో తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.ఈ మూవీ నిర్మాతలలో త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా ఒకరు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నది.ఈ మూవీ తమిళ్ టైటిల్ ‘ వాతి ‘ గా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.ఈ మూవీలో ధనుష్ కాస్ట్యూమ్స్ కోసం చిత్ర యూనిట్ 8 లక్షలు ఖర్చు చేస్తుందని వినికిడి.