టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే,టెస్ట్ లకు కెప్టెన్ గా నిర్వహించాలని అనుకున్నాడు కానీ బీసీసీఐ వేరే ప్రణాళికలో ఉన్నది అందుకే బీసీసీఐ కోహ్లీకి వన్డే కెప్టెన్ గా తప్పుకోవడానికి 48 గంటల సమయం ఇచ్చింది.ఈ 48 గంటలలో కోహ్లీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటంతో ఆయన్ని సంప్రదించకుండా రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించిందని ప్రస్తుతం నెట్టింటా ఓ వార్త వైరల్ అవుతుంది.ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.
ఇక వన్డే కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కీలక టోర్నీల్లో విఫలం చెందినప్పటికీ ఆయనకు మంచి రికార్డే ఉంది.కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా 95 మ్యాచ్‌లలో 65 మ్యాచ్‌లు గెలిచింది.అంతేకాదు ఈయన సారథ్యంలో భారత్ 19 ద్వైపాక్షిక సిరీస్‌లలో 15 విజయాలు సాధించింది.విరాట్ కోహ్లీ బాయ్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలో సీరీస్ లను కైవసం చేసుకున్నారు.