Kohli Video: టీమిండియా క్రికెట్ మాజీ సారథి విరాట్ కోహ్లీ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ ముందు తీసిన వీడియో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో తీసింది సూర్య కుమార్ యాదవ్ అని రాసుకొచ్చాడు.
Mobility is key 👌
Video credit – bhau @surya_14kumar pic.twitter.com/SjHH9l2g89— Virat Kohli (@imVkohli) October 12, 2022
ఆసియా కప్ ముందు వరకు విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో తంటాలు పడుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆసియాకప్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ టోర్నీలో విరాట్ అయిదు మ్యాచ్లు ఆడగా, మొత్తంగా 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.
ఇకపోతే ఆసియా కప్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ, ర్యాంకింగ్స్ రయ్ అని పైకి దూసుకొచ్చాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. రోహిత్ పక్కకు వచ్చేసాడు. ప్రపంచ బ్యాటర్స్ ర్యాంకింగ్ లో 15వ స్థానానికి చేరుకున్నాడు.
Kohli Video:
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవడం, అంతకు ముందు కొన్నాళ్లపాటు భారీ స్కోర్లు చేయకపోవడంతో కోహ్లీ ర్యాంకు, ఏకంగా 29 కి పడిపోయింది. ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చిన విరాట్, ర్యాంకుల వేటని మళ్లీ ఆరంభించాడు. ఆప్ఘన్ జట్టుపై భారీ సెంచరీ చేయడం, అంతకుముందు హాంకాంగ్, పాకిస్తాన్ హాఫ్ సెంచరీలు చేశాడు. టోర్నీలో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ర్యాంకు మెరుగుపరచుకొని 15 కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో ఈ ఫామ్ ను కొనసాగించాడు.