బాలీవుడ్ సెలబ్రిటీలకి, ఇండియన్ క్రికెటర్స్ కి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు ఇండియన్ క్రికెటర్స్ ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంత మంది క్రికెటర్స్ తో ప్రేమాయణం సాగించి తరువాత బ్రేక్ అప్ చెప్పేశారు. ఇక బాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ అంటే పటౌడీ నుంచి విరాట్ కోహ్లి వరకు చాలా జంటలు కనిపిస్తాయి. హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్ కూడా హీరోయిన్స్ నే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇక వీరి బాటలో ఇప్పుడు కొంత మంది యువ క్రికెటర్స్ సాగుతున్నారు. ముంబై పబ్ కల్చర్ లో ఫ్యాషన్ ప్రపంచంలో కలిసి ప్రయాణం చేయడం ద్వారా బాలీవుడ్ హీరోయిన్స్ తో స్టార్ క్రికెటర్స్ కి పరిచయాలు ఏర్పడతాయి.
అవి ప్రేమగా మారి కొన్ని పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని ప్రేమతోనే ముగిసిపోతాయి. ఇప్పుడు మరో క్రికెట్, అండ్ బాలీవుడ్ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్, వెటరన్ హీరో సునీల్ శెట్టి కూతురు చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారు చాలా సందర్భాలలో బయటపెట్టారు. పార్టీలలో కూడా ఇద్దరు కలిసి కనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లో కూడా అతియా, రాహుల్ జంటగానే ఉంటారు.
ఇక వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమ విషయాన్ని ద్రువీకరించడంతో పాటు త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. అతియా శెట్టి, కెఎల్ రాహుల్ కుటుంబాలు కూడా ఇప్పటికే పెళ్లి వ్యవహారాలు మాట్లాడుకున్నారని, జనవరిలో వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు బిటౌన్ లో వినిపిస్తున్న టాక్. పెళ్లి తర్వాత అతియా శెట్టి నటిగా కెరియర్ కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఇద్దరూ జంట కావడానికి కూడా ఎదురుచూస్తున్నారని బాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.