Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గురువారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి లైవ్ లో హౌస్ లో ఎవరికి వారు తమ కన్నీటి గాధలు తెలియజేస్తున్నారు. సిసింద్రీ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న సభ్యులు బేబీతో బాగా కలిసి పోవడంతో.. మీ జీవితంలో ఒక బేబీ ఉంటే మీ జీవితాన్ని ఆ బేబీ ఎలా మారుస్తుందో.. అని అనుకుంటున్నారో తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎవరికివారు తమ విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ లైవ్ లో కంటెస్టెంట్ కీర్తి చెప్పిన స్టోరీ అందరిని గుక్క పెట్టి ఏడ్చేటట్లు చేసిందంట.
విషయంలోకి వెళ్తే కీర్తి తాను డ్రైవింగ్ చేస్తూ తన తల్లిదండ్రులను, తోబట్టువులను ఒకే ఆక్సిడెంట్ లో పోగొట్టుకోవడం జరిగింది. ఆ సమయంలోనే మూడు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులను రక్తసంబంధులను కోల్పోయిన విషయాన్ని తెలుసుకుని కీర్తి చాలా డిప్రెషన్ కి గురైంది. ఇలా అనాధగా మారిపోయిన కీర్తి ఒక చిన్న పాపని పెంచుకోవడం జరిగింది. కానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆ పాప కూడా వెళ్లిపోయినట్లు ఫోన్ వచ్చిందని, తాను ఒంటరి అయిపోయినట్లు.. కీర్తి చెప్పిన స్టోరీ హౌస్ లో అందరిని కంటతడి పెట్టించడం జరిగింది.
కాగా ఎంతో విషాదకరమైన తన బాధను నవ్వుతూనే కీర్తి చెప్పటం విశేషం. అంతేకాదు తర్వాత హౌస్ లో ఎవరు తనని సింపతీతో చూడొద్దని కూడా తెలిపిందట. అయితే ఈ స్టోరీ విన్న తర్వాత రేవంత్ బాత్రూం వద్దకు వెళ్లి శత్రువుకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని డైలాగ్ వేసి భయంకరంగా ఏడ్చాడు. ఇక ఆదిరెడ్డి తన తల్లి సూసైడ్ గురించి చెప్పుకోవడం జరిగిందంట. ఈ రకంగా ఎవరికి వారు బిగ్ బాస్ హౌస్ లో తమ కన్నీటి గాధలను గురువారం ఎపిసోడ్ లో చెప్పుకోవడం జరిగింది.