బిగ్ బాస్ సీజన్ 6 ఆట షురూ అయ్యింది. మొదటి రోజు కింగ్ నాగార్జున అందరికి హౌస్ లోకి గ్రాండ్ గా పంపించారు. ఒక్కో కంటిస్టెంట్ లని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తూ వారిని పరిచయం చేస్తూ హౌస్ లోకి పంపించారు. అయితే గత ఐదు సీజన్స్ తో పాటు నాన్ స్టాప్ లో కూడా కనిపించింది ఈ సీజన్ 6లో ఒకటి మిస్ అయ్యింది. అది సెలబ్రెటీల డాన్స్ హంగామా. ఈ సారి హౌస్ ని సరికొత్తగా ఆవిష్కరించారు. అలాగే నాగార్జున హోస్ట్ చేసే స్టేజ్ కూడా కాస్తా కళాత్మకంగానే ఉంది. అయితే ఆ కలర్ ఫుల్ డిజైన్ కి తగ్గట్లు కింగ్ నాగార్జున హోస్ట్ లేదని కొంత నెగిటివ్ వైబ్ వినిపిస్తుంది.
గత సీజన్స్ లో నాగార్జున చాలా యాక్టివ్ గా కనిపించే వారు. అయితే ఆయనలో యాక్టివ్ తగ్గిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. రెగ్యులర్ గా తనకి అలవాటైన టైమింగ్ తో నాగార్జున కంటిస్టెంట్ లని పరిచయం చేస్తూ ఉంటారు. వారి హంగామా కూడా గట్టిగానే ఉంటుంది. అయితే ఈ సారి చాలా మంది హౌస్ లోకి వచ్చిన వారు ఎలాంగి హంగామా లేకుండా సింపుల్ ఏవీలతో వచ్చేసారు. అలాగే నాగార్జున కూడా వారిని ఎక్కువ డిస్కసన్ లేకుండా సింపుల్ గా హౌస్ లోకి పంపిం చేసారు.
అలాగే హౌస్ లోకి వెళ్ళే అందరి నుంచి కేవలం బిగ్ బాస్ తో ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్తున్న వారే కావడంతో టైటిల్ విన్నర్, అలాగే టాప్ 5 లో ఉండాలని అనుకుంటున్నారా లాంటి అంశాలు పెద్దగా చర్చించలేదు. టైటిల్ విన్నర్ కావాలనే ఆలోచన పెద్దగా ఎవరిలో కనిపించలేదు. ఏదో బిగ్ బాస్ లోకి వెళ్తే తమ ఐడెంటిటి అందరికి తెలుస్తుంది అని అనుకునేవారే ఉండటం గమనార్హం. అందులో వాస్తవం ఉన్న టైటిల్ గురించి ఎక్కువగా మాట్లాడిస్తూ, అలాగే కాస్తా కొత్తగా ఇంకేదైనా చూపించి ఉంటే బాగుండేది అనే మాట వినిపిస్తుంది.