Kidney problems: ప్రస్తుత కాలంలో యువత నుంచి పెద్దవారికి వరకు వేధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్లు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఆపరేషన్ వరకు వెళ్లాల్సి వస్తుంది. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. శరీరంలో చేరుకునే ఆహారాన్ని ఫిల్టర్ చేసి, వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. చిన్నచిన్న టిప్స్ ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?
యూరిన్‌లో లిక్విడ్, సాలిడ్ కంపోనెంట్స్ రెండూ ఉంటాయి. సాలిడ్ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్ యాసిడ్, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుంటాయి. ఇవి యూరిన్ లో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న రేణువులుగా మారతాయి. మంచినీళ్లు తాగకుండా ఉండే సరికి అవి మరింత పెద్దగా మారి రాళ్లుగా తయారవుతాయి. సాధారణంగా ఆక్జలేట్ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. నీరు సరిగ్గా తకకపోయినా, అధిక బరువు, డయాబెటిస్ సమస్య ఉన్నవారికి, శారీరక శ్రమ లేకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
ఏం చేస్తే సమస్య తీరుతుంది?
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్ కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని హార్వర్డ్ హెల్త్ నివేదిక వెల్లడించింది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఆ సమస్య తగ్గేవరకు ఈ కాంబినేషన్ తాగితే మంచిది. నిమ్మరసం రాళ్లను విచ్ఛిన్నం చేస్తే, ఆలివ్ ఆయిల్ రాళ్లు బయటకు వెళ్లేందుకు లూంబ్రికెంట్ గా పని చేస్తాయి.
Kidney problems:
అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలు శుభ్రంగా మారతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కిడ్నీలో రాళ్లను బయటకు పంపిస్తాయి. అన్నికంటే ముఖ్యంగా రోజులో తగినన్ని నీళ్లు తాగడం అతి ముఖ్యం.