తప్పు చేసిన తప్పు చేయకున్న పోలీసుల ఎదురుగా నిలబడి మాట్లాడాలంటే అందరూ భయపడుతుంటారు.అలాంటి పోలీసులు ముందు ఒక బుడ్డోడు ధైర్యంగా నిలబడి మాట్లాడాడు ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దుర్గామాత నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్థానికులు ఆ కార్యక్రమంలో డీజేను పెట్టారు.ఇది తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే సౌండ్ ఆపాలని అక్కడి వారికి చెప్పారు.వెంటనే అక్కడున్న ఓ బుడ్డోడు దుర్గామాత దగ్గర డీజే ఎందుకు పెట్టనియ్యరు.. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. కానీ ఇప్పుడైతే డీజే పెట్టుకోనీయండి.. అంటూ పోలీసులతో ఆరేళ్ల బుడ్డోడు ధైర్యంగా మాట్లాడేశాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.