Kiara Advani : కియారా అద్వానీ ఒక సంపూర్ణమైన ఫ్యాషన్‌వాది.ఈ బోల్డ్ నటి తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో క్రమం తప్పకుండా ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తుంటుంది. రెడ్ కార్పెట్ లుక్ లో అదరగొట్టాలన్నా.. ప్రమోషన్ ఫ్యాషన్ తో రెచ్చిపోవాలన్నా ఈ భామ తరువాతే ఎవరైనా. రీసెంట్‌గా ఈ బ్యూటీ త్వరలో విడుదల కాబోతున్న గోవింద నామ్ మేరా సినిమా కోసం ఆమె ప్రమోషన్ డైరీల నుండి స్నిప్పెట్ లతో అదరగొడుతోంది. కియారా ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో బిజీగా గడుపుతోంది. తాజాగా జరిగిన నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ కోసం ఆ బోల్డ్ స్టార్ అదిరిపోయే బ్లాక్ గౌనులో కనిపించి అందరిని షేక్ చేసి పాడేసింది. తన లేటెస్ట్ రెడ్ కార్పెట్ లుక్‌తో ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది.

Kiara Advani : కియారా, రెడ్ కార్పెట్ లుక్ కోసం బ్లాక్ శాటిన్ గౌనుని ఎంచుకుంది. ఈ లుక్‌తో ఈ బ్యూటీ ఫ్యాషన్ ప్రియులకు అత్యద్భుతమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను అందించింది. నల్లటి గౌనులె తెల్లటి చందమామలా రెడ్ కార్పెట్‌పై మెరుస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

ప్లంగింగ్ నెక్‌లైన్ , అసమాన హేమ్‌త, ఒక వైపు తొడ ఎత్తైన చీలికతో కటౌట్ డీటెయిల్స్‌తో డిజైన్ చేసిన ఈ డ్రెస్‌లో తన ఒంపు సొంపులను ఎద అందాలను, థైస్ ను చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. నడుముకు బ్లాక్ బెల్ట్ ధరించి మరింత అట్రాక్టివ్ గా కనిపించింది ఈ క్యూటీ. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మెడలో బ్లూ కలర్ పెండెంట్ తో వచ్చిన సిల్వర్ కలర్ నెక్ చైన్ వేసుకుంది. పాదాలకు బ్లాక్ కలర్ హీల్స్ వేసుకుని బోల్డ్ లుక్‌తో క్లీన్ బౌల్డ్ చేసింది.

ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహెర్ కియారాకు స్టైలిష్ లుక్స్‌ను అందించింది. అవుట్‌ఫిట్‌కు మరింత హాట్‌నెస్‌ను అందించేందుకు ఈ బ్యూటీ తన కురులను లూజుగా వదులుకుంది.

మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ మన్‌చందా కియారాకు అందమైన మేకోవర్‌ను అందించాడు. కనులకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరా వేసుకుని, కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన అందాలతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.