Kiara Advani : బోల్డ్ యాక్టింగ్‌తో బోల్డ్ ఫ్యాషన్ స్టైల్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. కియారా తాజాగా మరో అవతార్‌లో కుర్రాళ్ల మనసు దోచేసింది.

Kiara Advani : కియారా అద్వానీ అత్యద్భుతమైన ఫ్యాషన్ వాది. ఈ బ్యూటీ తన ఫ్యాషన్ డెయిరీస్ నుంచి స్నిప్పెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ నిత్యం ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటుంది. క్యాజువల్ అవుట్‌ఫిట్స్ నుంచి ఎత్నిక్ దుస్తుల వరకు స్టన్నింగ్ అవుట్‌ఫిట్స్ ధరించి ఫ్యాషన్ ప్రియుల మనసును గెలుచుకుంటోంది.
kiara-advani-stunning-looks-in-black-body-con-out-fit
కియారా ఫ్యాషన్ మంత్రా షార్ట్ అండ్ సింపుల్ గా ఉంటుంది. కంఫర్ట్ గా సింపుల్‌గా ఉంటూనే స్టైలిష్ గా కనిపించవచ్చని ఈ భామ చాలా సార్లు తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రూవ్ చేసింది. ఎత్నిక్ వేర్ నుంచి క్యాజువల్స్ వరకు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. ఏ డ్రెస్‌ను ఎలా వేసుకోవాలి ,ఎప్పుడు వేసుకోవాలో కియారాకు బాగా తెలుసు. తాజాగా ఈ బ్యూటీ ఓ బ్లాక్ అవుట్‌ఫిట్‌ను ధరించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఈ అవుట్‌ఫిట్‌కి సంబంధించిన పిక్స్‌ను కియారా తన ఇన్‌స్టాగ్రామ్ పొఫైల్‌లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

రీసెంట్‌గా చేసిన ఓ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం కియారా బ్లాక్ లెదర్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. ప్లంగింగ్ నెక్‌లైన్‌తో డెనిమ్ డీటైల్స్ తో వచ్చిన లెదర్ టాప్ వేసుకుంది కియారా . ఈ టాప్ కు జోడీగా బాడీకాన్ డీటైల్స్ తో వచ్చిన బ్లాక్ ట్రౌజర్స్‌ను ధరించింది. డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన టాప్‌లో తన ఎద అందాలను ఆరబోసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ.

తన లుక్ కు మరింత గ్రేస్ ను అందించేందుకు కియారా గోల్డెన్ బెల్ట్ డీటైల్స్‌తో వచ్చిన బ్లాక్ లెదర్ వెర్సేస్ బ్యాగ్ ను వేసుకుంది. ఈ పిక్స్‌కు జోడీగా క్యాప్షన్‌ను జోడించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తన వేవీ కురులను లూజ్‌గా వదులుకుంది కియారా మనిమల్ మేకప్‌తో మెస్మరూజ్ చేసింది. న్యూడ్ ఐ ష్యాడో, ఐ లైనర్, మస్కరా వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని అదరగొట్టింది.