తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాలలో నటించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ అమ్మడు తెలుగులో కంటే బాలీవుడ్ లో బాగా పాపులర్. అక్కడ వరుసగా సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గుర్తింపుని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కియారా అద్వానీకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హిందీలో యంగ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రతో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని వీరిద్దరూ అయితే అధికారికంగా ఇప్పటి వరకు దృవీకరించలేదు.
కాని పార్టీలకి, ఈవెంట్స్ కి కలిసి వెళ్ళడం ద్వారా కీయరా, సిద్దార్ద్ కలిసి ఉన్నారనే బిటౌన్ నమ్ముతుంది. అయితే గత కొద్ది రోజులుగా కియరా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్ర పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే వారి ఇళ్ళల్లో కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం జరిగింది అని, పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని బి టౌన్ లో జోరుగా వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కాని కియరా అద్వానీ తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ బిటౌన్ లో ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ 2వ తేదీని నా లైఫ్ కి సంబందించిన ఒక ముఖ్యమనైన విషయాన్ని మీతో పంచుకుంటా అని కియరా పేర్కొంది. ఆ విషయం చెప్పడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అని చెప్పింది. దీనిని బట్టి ఈ బ్యూటీ చెప్పేది పెళ్లి కబురు అనే టాక్ జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసిన నేపధ్యంలో డేట్ ని అఫీషియల్ గా ఆర్ రోజు ఎనౌన్స్ చేయడానికి కియరా, సిద్దార్ద్ సిద్ధం అయినట్లు టాక్ నడుస్తుంది.