అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. మొదటి సినిమాకి మించి హిట్ అందుకోవాలని సుకుమార్ ఇన్ని రోజులు స్క్రిప్ట్ మీద వర్క్ చేసి త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ మూవీలో రష్మిక మందన బన్నీకి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ తో పాటు మరో విలన్ కూడా ఉంటాడని టాక్ నడుస్తుంది. మరో వైపు సునీల్, అనసూయ పాత్రలు కూడా ఈ సీక్వెల్ లో కొనసాగనున్నాయి.
ఇక బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా అరోరాని ఈ సినిమాలో ఐటెం పాటకోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీ చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో చందూ మొండేటి ఉన్నారు. ఇక యూనివర్శల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ మూవీ తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా రామ్ చరణ్ తో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ సినిమా కోసం ఆమెకి ఏకంగా 5 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం కియారా అద్వానీ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో రామ్ చరణ్, శంకర్ పాన్ ఇండియా మూవీ కోసం ఆమెని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఇక అల్లు అరవింద్ కూడా కియారాకి అప్పుడే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తుంది. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే వరకు వేచి చూడాలి.