Kiara Advani : సోషల్ మీడియాలో యాక్టివ్ స్టార్ బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. ఈ భామ బోల్డ్ యాక్టింగ్‌తోనే కాదు బోల్డ్ లుక్స్‌తోనూ అందరిని మాయ చేయగలదు. అకేషన్‌కు తగ్గట్లుగా ఫ్యాషన్ దుస్తులను ఎన్నుకోవడంలో కియారా ముందు వరుసలో ఉంటుంది. రోజు రోజుకు ఈమె అందం పెరిగినట్లే ఫ్యాషన్ సెన్స్‌లో పక్కా ప్రొఫెషనల్ గా ఉంటోంది ఈ భామ. ఓ వైపు విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూనే, వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాషన్ దుస్తులతో హాట్ ఫోటో షూట్‌లను చేసి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ అవార్డ్స్ ఫంక్షన్‌లో తెల్లని చీరతో కళుక్కుమని కుర్రాళ్లకు చెమటలు తెప్పించింది.

Kiara Advani : మహారాష్ట్రలో జరిగిన ఓ అవార్డు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది కియారా అద్వానీ. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ గౌరవనీయులైన నాయకులు ఏకనాథ్ షిండే , దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా మహారాష్ట్రియన్ అవార్డును అందుకుంది ఈ చిన్నది. ఆనందంలో మునిగి తేలిన కియారా ట్విట్టర్ ఖాతాలో వేడుకకు సంబంధించిన పిక్ ను పోస్ట్ చేసింది. అంతే కాదు ఈ అవార్డు వేడుక కోసం అందమైన తెల్ల చీరను కట్టకుని అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.

స్లీవ్‌లెస్ హెవీ ఎంబ్రాయిడరీ తో స్టైలిష్‌గా డిజైన్ చేసిన బ్లౌజ్ ను వేసుకుని అదరగొట్టింది కియారా. దీనికి జోడీగా వైట్ ఎంబ్రాయిడరీతో అద్భుతమైన డిజైన్స్ తో వచ్చిన ట్రాన్స్ పరెంట్ వైట్ కలర్ చీరను సాంప్రదాయ బద్ధంగా కట్టుకుని కుర్రాళ్ల మనసుదోచేసింది. చీరకొంగు జార్చి అందాలు చూపిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఈ చీరకట్టుకు తగ్గట్లుగా కియారాకు స్టైలిస్ట్ సీమా అందమైన హెయిర్ స్టైల్ అందించగా, మేకప్ ఆర్టిస్ట్ లేఖ, కియారా అందానికి మెరుగులు దిద్దింది. తెల్ల చీరలో పువ్వులా మెరిసింది.

లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సీరీస్ లో బోల్డ్ క్యారెక్టర్‌తో తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కియారా అద్వానీ. అప్పటి వరకు బుల్లితెరపై సందడ చేసిన ఈ భామకు వెండితెర అవకాశాలు తలుపుతట్టాయి. మహేష్ బాబు సరసన భరత్ అనె నేను సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో గ్లామర్ రోల్ చేసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది.

ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు కియారా వెళ్తుందని అనుకునే లోపే బాలీవుడ్‌లో మకాం వేసింది కియారా. ప్రస్తుతం బాలీవుడ్‌లో చేతి నిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది కియారా.
