Ketika Sharma: యువ హీరోయిన్, ఢిల్లీ పిల్ల కేతిక శర్మ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అందాల ఆరబోతతో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ డైరెక్టర్ పూజీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. మొదటి సినిమాలోనే హాట్ అందాలతో రెచ్చిపోయిన కేతిక శర్మకు.. అవకాశాలు అడపాదడపాగానే వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనను ప్రమోట్ చేసుకొనేందుకు ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ లో ఫొటో షూట్లు చేస్తూ అందాలతో కనువిందు చేస్తోంది. తన గ్లామర్ టచ్ తో కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో అవకాశాలు మెరుగుపడేందుకు, గ్లామర్ గాళ్ గా పేరు తెచ్చుకొనేందుకు కాస్త గ్లామర్ డోసు పెంచుతోంది.
రొమాంటిక్ మూవీతో కాస్త రొమాంటిక్ గానే నటించిన ఈ ముద్దుగుమ్మ.. అందాలతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. టాలీవుడ్ సర్కిల్స్ లో, ప్రేక్షకుల్లోనూ కేతిక శర్మ పేరు మార్మోగింది. ఇటీవల కేతిక శర్మ రంగరంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ సరసన ఆడి పాడింది. ఈ చిత్రంలో మరోసారి అందాలతో విందు చేసింది. తమిళంలో హిట్ సాధించిన వినోదయ సీతం మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
Ketika Sharma: పవన్, సాయి ధరమ్ తేజ్ కనిపిస్తారని టాక్..
రంగరంగ వైభవంగ మూవీలో హైప్ క్రియేట్ చేయడానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మరో హీరో సాయి ధరమ్ తేజ్ గెస్ట్ రోల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దీంతో అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు కేతిక శర్మ నెట్టింట అందాల ఆరబోత కూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. తాజాగా ఫొటో సెషన్ లో రెడ్ డ్రస్ లో కేతిక శర్మ కనువిందు చేసింది. రొమాంటిక్ పోజులతో మతి పోగొట్టేలా చేస్తోంది. ఈ ఫొటోలను నెటిజన్లు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.