బాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ అందాల ప్రదర్శనలో ఎప్పుడు ముందు ఉంటుంది. బిగుతైన ఎద అందాలతో ఈ అమ్మడు అందరిని ఇట్టే ఆకర్షిస్తుంది. దీంతో ఈమె సొగసులు చూసిన దర్శకులు వెంటవెంటనే అవకాశాలు ఇచ్చారు. తెలుగులో పూరి జగన్నాథ్ ఈ అమ్మడుని పరిచయం చేశాడు. కొడుకుతో తెరకెక్కించిన రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మని హీరోయిన్ ని తీసుకున్నాడు. ఇక ఈమె అందాల ప్రదర్శనని సినిమా కోసం కావాల్సినంతగా పూరి టీం వాడేసుకుంది. ఇక కేతిక శర్మ కూడా దేనికి అడ్డు చెప్పకుండా తెరపై నిండుగా అందాలని చూపించేసింది. అయితే అంత చేసినందుకు రొమాంటిక్ సినిమా కేతిక శర్మకి ఏ విధంగా కూడా కలిసి రాలేదు.
సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికి గుర్తులేదు. ఆ తరువాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా కోసం పెద్దగా అందాల ప్రదర్శన చేయకున్న కొంత గ్లామర్ గా మాత్రం కనిపించే ప్రయత్నం చేసింది. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. రెండు సినిమాలు నిరాశనే మిగిల్చిన ఏకంగా మూడో అవకాశాన్ని రంగరంగవైభవంగా సినిమాతో మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయిపోయి వైష్ణవ్ తేజ్ కి జోడీగా నటించింది.
ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ రోల్ లో ఈ అమ్మడు కనిపించింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తనకి కచ్చితంగా మంచి సక్సెస్ ఇస్తుందని గట్టిగా నమ్మింది. తెలుగులో సెటిల్ అయిపోవచ్చని భావించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఏ మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేక పూర్తిగా రెండో రోజుకే తేలిపోయింది. దీంతో కేతిక శర్మ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకొని కేతిక శర్మ ఐరన్ లెగ్ ముద్రని తనపై వేసేసుకుంది. మరి ఆ ముద్ర పోగొట్టే సినిమా మరొకటి ఆమెకి వస్తుందా లేదా అనేది చూడాలి.