RRR : ఇటీవలి కాలంలో వసూళ్ల సునామీ సృష్టించిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు పోటీపడి మరీ నటించడంతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. పైగా దర్శకధీరుడు రాజమౌళి చిత్రం కావడంతో దీని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా ఈ ఏడాది మార్చి 25న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, చెర్రీ, తారక్‌ల డ్యాన్స్ అన్నీ ప్లస్ అవడంతో వసూళ్ల పరంగా దుమ్మురేపింది. అందుకే ఈ సినిమాపై హాలీవుడ్ రచయితలు సైతం ప్రశంసలు కురిపించారు.
RRR : హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు..
తాజాగా ఈ సినిమాను ఒక పోర్న్ స్టార్ పొగడ్తలతో ముంచెత్తింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను ఇటీవల పోర్న్ స్టార్ కేండ్రా లస్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో చూసింది. అనంతరం ట్విటర్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’పై ప్రశంసల జల్లు కురిపించింది. చెర్రీ, తారక్‌ల నటనతో పాటు హ్యాండ్సమ్‌గా ఉన్నారంటూ కితాబిచ్చేసింది. సినిమాకు సంబంధించి ప్రతిదీ పర్ఫెక్ట్ అని పేర్కొంది. ”నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చూశాను. అదరగొట్టేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, స్టంట్స్, డైలాగ్ డెలీవరీ, పాటలు, సినిమాటోగ్రఫీ .. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. వారిద్దరి నటన ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ప్రాణం పోసింది” అని కేండ్రా లస్ట్ ట్వీట్‌లో పేర్కొంది. నిజానికి ఈ రేంజ్‌లో సినిమాను ఆకాశానికి ఎత్తడం తారక్, చెర్రీల అభిమానులను ఆనందోత్సాహంలో ముంచెత్తుతోంది.
థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ సినిమా హవా కొనసాగిస్తోంది. ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ హైలైట్‌గా నిలిచింది. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఎలా జరిగిందనే విజువల్స్‌ను చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంటోంది. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్‌ను కూడా విడుదల చేసింది. ఈ విజువల్ మేకింగ్ వీడియోలను చూసిన వారంతా అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి కేండ్రా లస్ట్ ట్వీట్‌తో ఈ సినిమాను ‘గే లవ్ స్టోరీ’ అంటూ చీప్ కామెంట్స్ చేసిన వాళ్ల నోళ్లు ఇప్పటికైనా మూతపడతాయేమో చూడాలి.