మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ ని సైతం సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ అమ్మడు సావిత్రి బయోపిక్ మహానటి తర్వాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అమాంతం తన రేంజ్ పెంచేసుకుంది. అయితే ఆ మూవీ తర్వాత స్టోరీ సెలక్షన్ లో లోపాల కారణంగా ఆమె నుంచి వచ్చిన ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అన్ని డిజాస్టర్ అవుతూ వచ్చాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా చేసిన సర్కారువారిపాట సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇదే సమయంలో ఇక మడికట్టుకొని కూర్చుంటే సెట్ కాదని భావించిన కీర్తిసురేష్ కాస్తా గ్లామర్ ఫోటోషూట్ లు చేసుకుంటూ తనలో ఉన్న కొత్త యాంగిల్ ని దర్శకులకి పరిచయం చేస్తుంది.
స్లిమ్ అయ్యి గ్లామర్ రోల్స్ కి కీర్తి సురేష్ సై అంటూ ఉండటంతో ఆమెకి అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె నటించిన దసరా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటించింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. మలయాళంలో ఒక సినిమా కమిట్ అయ్యి ఉంది. దీంతో పాటు జయం రవి హీరోగా తమిళ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సెరిన్ లో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది. గల్ఫ్ దేశాలలో సెటిల్ అయిన తమ ఫ్యామిలీకి చెందిన వ్యాపారవేత్తకి ఆమె పెళ్లాడబోతుంది అనే టాక్ నడుస్తుంది. కోటీశ్వరుడుగా ఉన్న అతనితో ఇప్పటికే కుటుంబం పెళ్లి సంగతి మాట్లాడేసింది అని చెప్పుకుంటున్నారు. కీర్తి సురేష్ కూడా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే ఓ వైపు పెళ్లి కబుర్లు వినిపిస్తూ ఉంటే కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచి కమర్షియల్ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు చేయాలనే టార్గెట్ తో దూసుకెళ్తున్నట్లు ఆమె జర్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ రెండు భిన్నమైన ధృవాలు. మరి ఈ నేపధ్యంలో పెళ్లి వార్తలు ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.