ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ కెరియర్ ఆరంభంలో సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు నవీన్ కృష్ణతో మొదటి సినిమా చేసింది. అయితే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఏవో కారణాల వలన రిలీజ్ కాలేదు. ఆ మూవీ తర్వాత నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యి స్టార్ హీరోయిన్ అయిపొయింది. అయితే ఆ సినిమా ఇప్పటికి నాలుగు సార్లు టైటిల్ మార్చుకొని మీడియాలో హడావిడి చేసింది. సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెబుతూ వచ్చారు.
అయితే ముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం, మళ్ళీ ఆగిపోవడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా ఇన్నేళ్ల తర్వాత మరోసారి జానకిరామ్ అనే టైటిల్ తో సినిమాతో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాంప్రసాద్ రగుతు దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుందని, త్వరలో రిలీజ్ చేస్తామని నిర్మాత చెప్పుకొచ్చారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపధ్యంలో ప్రేమ కథ కలగాల్సిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకి వస్తుందని నిర్మాత చెప్పారు. సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని కూడా చెప్పారు.
ఇక ఈ సినిమాలోని పాటలకి మంచి స్పందన వచ్చిందని ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాపై హీరోగా నటించిన నవీన్ కృష్ణ గాని, కీర్తి సురేష్ గాని, అలాగే దర్శకుడు రామ్ ప్రసాద్ గాని ఎలాంటి ప్రచారం చేయలేదు. వారెవరు లేకుండానే నిర్మాతే ఈ సినిమాని వీలైనన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసి తరువాత కీర్తి సురేష్ ఫేమ్ ఉపయోగించుకొని ఓటీటీకి అమ్మేయాలని అనుకుంటున్నారు. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడనిధి మాత్రం నిర్మాత చెప్పలేదు.