ఫస్ట్ వేవ్, సెకండ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందల పాలు చేసిన సంగతి తెలిసిందే కదా. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరతతో చాలా మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా.. ఓమైక్రాన్ రూపంలో విజృంభిస్తోంది. కరోనా (Corona) థర్డ్ వేవ్‌లో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. ఈ కోవలో మహేష్ బాబు, తమన్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూతో పాటు శోభన సహా ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఈ కోవలోనే రేణు దేశాయ్‌తో పాటు ఆమె తనయుడు అకిరా నందన్ కోవిడ్ బారిన పడ్డట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. ఇక, లేటెస్ట్ గా హీరోయిన్ కీర్తిసురేశ్ కు కరోనా సోకింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రతిఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరింది.
హీరోయిన్ కీర్తిసురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఆమె.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. మహానటితో మన అందర్నీ మెప్పించిన కీర్తి సురేష్ తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.
సోషల్ మీడియాలో కీర్తి సురేష్.. ” నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను.” అని పోస్ట్ చేసింది.
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. అయితే, కీర్తిసురేశ్.. ‘సర్కారు వారి పాట’, ‘గుడ్‌లక్ సఖి’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే ‘సాని కాయిదమ్’, ‘భోళా శంకర్’, ‘వాసి’, ‘దసరా’ చిత్రాల్లో నటిస్తోంది.
ALSO READ: కోవిడ్ బారిన పడ్డ అకిరా నందన్..రేణు దేశాయ్…