Keerthi Suresh : సోషల్ మీడియాలో బాలీవుడ్ భామలే కాదు సౌత్ బ్యూటీ లు తమదైన శైలిలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఆక్టివ్ గా ఉండే స్టార్ లో కొద్దిమంది పేర్లు మాత్రం కచ్చితంగా వినిపిస్తాయి. సమంత, రకుల్, పూజ హెగ్డే లతోపాటు కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ వైపు సినిమాలతో తన నటనతో అభిమానులను అలరిస్తూనే మరోవైపు క్రేజీ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.
కీర్తి సురేష్ తరచుగా ఇంస్టాగ్రామ్ వేదికగా అద్భుతమైన ఫోటో షూట్ పిక్స్ లు పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్ అందిస్తుంది. ఒక్క స్టార్ ది ఒక్కోరకమైన ఫ్యాషన్ స్టైల్. ఈ స్టార్ బ్యూటీ అన్ని రకాల ఫ్యాషన్స్ తో ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది.

తాజాగా కీర్తి సురేష్ తెల్లటి చీరకట్టుతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆ చీరకే సరికొత్త అందాన్ని జోడిస్తుంది ఈ బ్యూటీ. రెడ్,ఎల్లో, గ్రీన్ రంగుల ఫ్లోరల్ డిజైన్స్ తో డిజైన్ చేసిన ఈ చీర కీర్తికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సాంప్రదాయ పద్ధతిలో కట్టుకొని ఎత్నిక్ లుక్ తో అమేజింగ్ గా కనిపిస్తోంది. ఈ చీరకు జోడిగా స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో వచ్చిన స్లీవ్ లెస్ వైట్ కలర్ బ్లౌజు వేసుకుంది.

ఈ శారీ లుక్ తో దిగిన ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. కీర్తి లుక్స్ కెవ్వు కేక అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో ఈ అమ్మడికి మంచి ఆఫర్లే అంది వచ్చాయి. మహానటి సినిమాతో మంచి బ్రేక్ ని సంపాదించింది ఈ సినిమాలో కీర్తి నటనకి ప్రేక్షకులు దాసోహం పలికారు. అచ్చు సావిత్రిలా కనిపించి, నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నాని నితిన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని సభాష్ అనిపించుకుంది ఈ సౌత్ బ్యూటీ. ఏడది విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది కీర్తి సురేష్. ప్రస్తుతం నాచురల్ స్టార్ నానితో సినిమా చేస్తోంది. దసరా మూవీలో ఒరేంజ్ మాస్ లుక్ లో కనిపించబోతోంది ఈ బ్యూటీ.