BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు ఎలా గడిచాయో తెలీదు. కానీ మూడో వారం మాత్రం భలేగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుడి కోసం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్స్ అందరూ ప్రదర్శన చూపేందుకు వారిదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. లాస్ట్ వీకెండ్ లో నాగార్జున క్లాస్ పీకడంతో కంటెస్టెంట్స్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
హౌస్ కంటెస్టెంట్స్ ప్రదర్శన బాగాలేదనే కారణంతో వారికి ఏకంగా లగ్జరీ బడ్జెట్ ను కూడా బిగ్ బాస్ క్యాన్సిల్ చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎలాగైన ఈ వారం ప్రదర్శన చూపాల్సిందే అనే అభిప్రాయంతో దాదాపు అందరూ బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ని ఆడటం జరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ మరో మెలిక పెడుతూ శుక్రవారం ఓ యాక్టీవిటీ ఇస్తారు.

బిగ్ బాస్ ఈ యాక్టివిటీకి పెట్టిన పేరు ‘నేను ఎంతలా కనిపిస్తున్నాను’. హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ తమ ప్రదర్శనను బట్టి షోలో ఎంతలా కనిపిస్తున్నారో చెప్పాలనేది ఈ యాక్టివిటీ ముఖ్య సారంశం. ఇందులో జీరో నుంచి టెన్ మినిట్స్ వరకు టైమింగ్ ఉంది. ఒక్కో హౌస్ మేట్ తమ ప్రదర్శనని బట్టి ఎన్ని నిమిషాలు కనిపిస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఎవరికి వారు వారి ప్రదర్శన బట్టి అంచనా వేస్తూ ఎన్ని నిమిషాలు ఎపిసోడ్ లో కనిపించి ఉంటామో కంటెస్టెంట్స్ చెబుతారు. వారి అభిప్రాయాన్ని తోటి హౌస్ మెంట్స్ ఎంత మంది ఏకీభవిస్తున్నారు అనే దానిపై ఓటింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆరోహి, అర్జున్, కీర్తి వీరు ముగ్గురికి 0 మినిట్స్ అని హౌస్ మేట్స్ వారి అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. దీంతో బాగా హర్ట్ అయిన కీర్తీ హౌస్ లో చాలా సేపు బోరునా ఏడ్చేసింది. కీర్తీని ఆరోహితో పాటు మరికొంత మంది సముదాయించే ప్రయత్నం చేస్తారు.