BIGG BOSS: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఓ ఆసక్తిరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ సాయంత్రం ఆరు గంటలకే స్టార్ట్ చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ లో ఆటలు, పాటలు, మచ్చట్లు, ఎలిమినేషన్ ఇలా అన్ని రకాల వినోదాలతో సరదా సదరాగా సాగింది. ఈ క్రమంలో కీర్తికి సంబంధించిన ఓ విషయంపై ఈ ఎపిసోడ్ లో చర్చ కొనసాగింది.
లాస్ట్ వీక్ లో హౌస్ లో కీర్తి ఒంటరిగా బెడ్ రూంని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బాలాదిత్య, చంటి, సుదీప మధ్య కీర్తి చేస్తున్న క్లీనింగ్ విషయంపై చర్చ సాగుతుంది. కీర్తి ఎక్కడికి వెళ్లింది.. ఒంటిరిగా క్లీన్ చేస్తోందా.. ఎవరినైనా తోడుగా తీసుకెళ్లమని చెప్పాను కదా అని బాలాదిత్య అంటాడు. దీంతో కెమెరాలు ఉన్నాయిగా అందులో రికార్డు అయితే చాలు అని అనుకుంటుంది అంటాడు చంటి. కెమెరాలు ఒక్కటి చూస్తే ఎలా ఎవరికై తెలియాలి కదా క్లీన్ చేస్తున్న విషయం అన సుదీప అంటుంది.

ఇలా వీరు మాట్లాడుకున్న సంభాషణను గీతూ తనదైన శైలిలో కీర్తి చెవిలో వేసి ఉంటుంది. దీంతో కీర్తికి విషయం ఏంటో అర్ధం కాక చంటి, బాలాదిత్య మీద కోపం పెంచుకుని ఉంటుంది. తర్వాత తన అభిప్రాయం తప్పని తెలిసి బాధపడుతుంది. నాగార్జున ఈ విషయం గురించి ఆదివారం ఎపిసోడ్ లో చర్చ పెడతాడు. కేవలం చర్చ మాత్రమే కాదు ఏకంగా ఆ రోజు చంటి, బాలాదిత్య ఏ ఉద్దేశ్యంలో అలా కీర్తిని అనాల్సి వచ్చిందో అనే దానిపై క్లారిటీ ఇవ్వడం కోసం ఆ మాటలను కూడా హౌస్ లో ప్తే చేస్తాడు.
దీంతో వారు సదుద్దేశ్యంతోనే అన్న మాటలను గీతూ కావాలనే కెమెరాలు చూడటం కోసం పని చేస్తుంది కీర్తి అనేలా క్రియేట్ చేసి చెప్పిందని అప్పుడు అర్ధం అవుతుంది. ఈ వీడియో చూసి తాను గీతూ చెప్పిన మాటలను విని తప్పుగా అర్ధం చేసుకున్నాను దయచేసి నన్ను క్షమించండి అని కీర్తి రెండు చేతులు జోడించి మరీ చంటికి క్షమాపణ కోరుతుంది. దీంతో ఈ గడవకు సంబంధించిన అంశం ముగిసిపోతుంది.