Priyanth Rao: పోలీసుల కొన్ని నెలల పాటు వెదికి ఎలాగైతేనేమి ఓ కేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఇక్కడ కథలో పెద్ద ట్విస్ట్ ఆ నిందితుడి భార్య తన భర్తకు లాకప్‌లో దోమలు కుడుతున్నాయని.. ఉక్కపోతతో అల్లాడుతున్నాడని కాబట్టి ఆయనను క్యారవాన్‌లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దానిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టింది. ట్విస్ట్ అదిరింది కదా. ఇంతకు ఆమె ఎవరా? అనుకుంటున్నారా? ‘మా ప్రయాణం’ అనే దిక్కు మొక్కు లేని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంత్ భార్య.
సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ లక్‌తో పాటు కొందరి దయాదాక్షిణ్యాలు మెండుగా ఉండాలి. ఇక్కడ ఓ వెలుగు వెలగాలని.. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది వస్తుంటారు. కానీ వారిలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మంది మాత్రమే సక్సెస్ అవుతారు. దీని వెనుక ఎన్నో త్యాగాలు, కాంప్రమైజ్‌లు సవాలక్ష ఉంటాయి.అలాగే ఓ అమ్మాయి.. కూడా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమెకు కాలం కలిసి రాలేదు. కేవలం జూనియర్ ఆర్టిస్ట్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి ప్రియాంత్ హీరోగా నటిస్తున్న ‘మా ప్రయాణం’ సినిమాలో అవకాశం వచ్చింది.
ఆమెను ప్రియాంత్ మెల్లిగా లైన్‌లో పెట్టాడు. ఒకరోజు హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి రిసార్ట్‌కు తీసుకెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అని తెలిసింది. దీంతో ప్రియాంత్ మొహం చాటేయడం మొదలుపెట్టాడు.అదేమంటే నీ దిక్కున్న చోట చెప్పుకోపొమ్మన్నాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లిహిల్స్ పోలీసులు ఎలాగైతేనేమి అతడిని వెదికి పట్టుకున్నారు. అత్యాచారంతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తన భర్త ఏదో దేశం కోసం పోరాటంలో జైలుకు వెళ్లినట్టు అతని భార్య క్యారవాన్‌ను తీసుకురావడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.చట్టం ఒప్పుకోదని చెప్పినా వినిపించుకోదే.. పైగా ఆవరణలోనే ఉంచుతాం కదా? ఇంక సిబ్బందితో పనేంటని ఎదురు ప్రశ్నలు.. చివరకు ఆమెకు నచ్చజెప్పి పోలీసులు ఇంటికి పంపించేశారు.