KCR: తెలంగాణలో ఎంతో ఆసక్తిని రేపిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఫలితాలు కూడా విడుదల కాగా.. మునుగోడు గడ్డ మీద గులాబీ పార్టీ జెండా ఎగరేసింది. నువ్వే నేనా అన్నట్లు సాగిన ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. ఫలితాల వేళ ఒక్కో రౌండ్ కు అన్ని పార్టీల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరకు మునుగోడును కేసీఆర్ సొంతం చేసుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ గెలిచిన తర్వాత కేసీఆర్.. మునుగోడు ఫార్ములానే రాష్ట్రం అంతలా వాడాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇదే ఫార్ములాను వాడటం ద్వారా విజయం సాధించాలని కేసీఆర్ పథక రచన చేస్తున్నారట. ఇంతకీ మునుగోడులో కేసీఆర్ ఏం చేశారు.. రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం.
మునుగోడులో కేసీఆర్ ప్లాన్ ఇదే:
మునుగోడు ఉప ఎన్నికకు అంతా సిద్ధం కాగానే బీజేపీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగడం తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని టీఆర్ఎస్ బరిలోకి దించుతుందని అందరూ అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కూసుకుంట్ల ప్రభాకర్ ను బరిలోకి దించి సొంత పార్టీ నేతలకు సైతం షాకిచ్చారు.
కూసుకుంట్ల ప్రభాకర్ బరిలోకి దిగితే గెలుపు కష్టమే అని సొంతం పార్టీ నేతలు చెప్పినా.. పార్టీ బలంతో ఎలాగోలా కేసీఆర్ మునుగోడులో గెలిచారు. బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే.. కేసీఆర్ మాత్రం పార్టీని బలోపేతం చేసేలా పార్టీ హైలెట్ అయ్యేలా అభ్యర్థిని ఎంచుకొని తన రాజకీయ చతురతను చూపించారు.
KCR:
ఇక మీదట రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఇలానే చేయాలని అనుకుంటున్నారట. పార్టీ బలంతోనే అభ్యర్థులను గెలిపించుకోవాలని, అభ్యర్థుల బలం మీద ఆధారపడకూడదని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే పార్టీని బలపరిచేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారట. మరి రాబోయే ఎన్నికలకు ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.