KCR Plan for BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ.. అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తమ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మారుతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. జాతీయ పార్టీని ప్రకటించడానికి ముందు, కేసీఆర్ చాలా రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు చాలామంది మేధావులతో చర్చించారు.
తెలంగాణలో విజయవంతంగా కొనసాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని దేశస్థాయిలో కూడా కొనసాగించాలని పక్కా ప్రణాళికతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్లు సమాచారం. ఇందుకు గాను ఆయన చాలా రోజులు అధ్యయనం చేసి, ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి రాజకీయాల విషయంలో చాలా తేడా ఉందనే విషయాన్ని అర్థం చేసుకున్నారట.
తనకు పట్టు, పరిచయాలు ఉన్న దక్షిణ భారతదేశం నుండే తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారట. అందులో భాగంగా గతంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని టార్గెట్ గా చేసుకుంటున్నారట. పాత హైదరాబాద్ రాష్ట్రంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట.
KCR Plan for BRS
ఈ నాలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే అధికారంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోనూ సత్తా చాటాలని కేసీఆర్ పథకాలు రచిస్తున్నారట. అలాగే తెలుగు వారు ఎక్కువగా ఉండే, తెలుగు మాట్లాడే ప్రాంతాలున్న కర్ణాటక మరియు మహారాష్ట్రలోనూ ప్రాబల్యాన్ని చాటుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి జాతీయ రాజకీయాలను దక్షిణ భారతదేశం నుండి మొదలుపెట్టి ఉత్తర భారతదేశానికి విస్తరించుకుంటూ పోవాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట.