Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఈ దసరా పండుగ రోజున భారతీయ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. బిఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చేందుకు కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని కుప్పకూల్చే దిశగా కేసిఆర్ బిఆర్ఎస్ పేరుతో హడావుడి చేస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల కీలక నేతలతో కేసిఆర్ సంప్రదింపులు జరిపి వారి మద్దతు కోరారు. సుధీర్ఘ చర్చల అనంతరం కేసిఆర్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ముందుగా దక్షణాది రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరింపజేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఏపీ రాజకీయాలపై కూడా కేసిఆర్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఏపీలో కేసిఆర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగా మీడియా ద్వారా తెలియజేడంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు అనేమంది సీనియర్ నాయకులు సిద్దంగా ఉన్నారని కూడా ఈ పార్టీ నాయకులు అంటున్నారు. దీంతో ఎవరెవరు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారు… ఒకవేళ నిజంగానే అలా జరిగితే ఏపీలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువుల… శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఈ పరిణామాలకు సరిపోతుంది. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో చేరతారో అనేది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నే…!