KCR: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఎన్నో రాజకీయ సమీకరణలకు, విమర్శలకు తెర తీసింది. మునుగోడులో ప్రత్యర్థి పార్టీలకు టీఆర్ఎస్ చెక్ పెట్టిన పద్ధతి రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. బీజేపీ బరిలోకి దించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ కేసీఆర్.. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, సీపీఐలు కలిసి పని చేశాయి. మునుగోడులో సీపీఐతో చేసిన దోస్తీని వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగించాలని టీఆర్ఎస్ అధినేత అనుకుంటున్నారట. అందుకే ఇందుకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి కోసం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది.
హుస్నాబాద్ నుండి బరిలోకి దిగి గెలవాలని చాలా కాలంగా కలలు కంటున్న చాడ వెంకట్ రెడ్డికి పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని కేటాయించాల్సి వస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ హుస్నాబాద్ లో టీఆర్ఎస్ బలంగా ఉండటం, వరుసగా రెండుసార్లు పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో.. ఆ స్థానాన్ని వదులుకోకూడదని కేసీఆర్ కు టీఆర్ఎస్ వర్గాలు చెప్పినట్లు తెలిసిందే.
KCR:
దీంతో హుస్నాబాద్ నుండి సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వలేని స్థితిలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. చాడ వెంకట్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు కాకుండా ఎమ్మెల్సీ సీటును కేటాయించాలని అనుకుంటున్నారట. అలా అయితే సీపీఐతో దోస్తీ కొనసాగుతుందని, అదే సమయంలో హుస్నాబాద్ సీట్ ను కోల్పోక్కర్లేదని కేసీఆర్ ప్లాన్ వేశారట. మరి వచ్చే ఎన్నికల నాటికి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలని రాజకీయ పండితులు అంటున్నారు.