KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం తెలిసిందే. భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతామని దసరా వేళ.. అధికారికంగా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. తాజాగా తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన మునుగోడులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు.
అంతకుముందు మునుగోడులో పరిస్థితి గురించి నేతల ద్వారా, పలు రకాలుగా వివరాలు సేకరించారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక ఆఖరి అంకానికి చేరడంతో.. కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల మీద దృష్టిసారించనున్నారని తెలుస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసినట్లు వార్తలు సంచలనంగా మారడం తెలిసిందే.
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని బొగట్టా. అయితే టీఆర్ఎస్ నుండి నలుగురు ఎమ్మెల్యేలకు ఇలా కాల్స్ రాగా.. వారు పోలీసులకు సమాచారం అందించి, మొయినాబాద్ లోని ఓ ఫాం హౌజ్ కు చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పైరవీ చేయడానికి ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
KCR:
బీజేపీ ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా దొంగదారిన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనే విషమాన్ని హైలెట్ చేస్తూ కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తారని సమాచారం. ఇందుకు గాను నలుగురు ఎమ్మెల్యేలను తన వెంట ఢిల్లీకి తీసుకెళతారని, వివిధ పార్టీల నేతలతో దీని గురించి ప్రస్తావిస్తారని, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతారని రాజకీయ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. మొత్తానికి బీజేపీకి చెక్ పెట్టడానికి, తన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.