KCR : సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు అయినా, అభివృద్ధి పనులైన, ప్రాజెక్టులైనా, ఆలయాల పుననిర్మాణమైనా ప్రతి అంశంలోనూ సరికొత్త విధానాలను పథకాలను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్లపాటు ప్రజల గుండెల్లో గుర్తుండి పోవాలి. అలాంటి పనులు చేస్తూ ముందుకు కదులుతున్నారు కేసీఆర్. తాజాగా కొండగట్టు అభివృద్ధి కోసం 100 కోట్లను మంజూరు చేసారు.

KCR :ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది. భారీ బడ్జెట్ తో గుట్టపైన నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోయాయి. యాదాద్రి అందాలు అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సుమారు 500 కోట్ల బడ్జెట్తో ఆలయాన్ని అభివృద్ధి చేశారు ముఖ్య మంత్రి. టెంపుల్ సిటీ డెవలప్మెంట్ కోసం 1300 కోట్లు కేటాయించారు. యాదాద్రి నరసింహులు వైభవాన్ని చూసేందుకు లక్షలాదిమంది భక్తులు ఇప్పుడు ఆలయానికి చేరుకుంటున్నారు. అది తరహాలో కొండగట్టు అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ముందడుగు వేశారు ఆలయ అభివృద్ధి పనుల కోసం 100 కోట్లను కేటాయించారు.

త్వరలో కొండగట్టులో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. యాదాద్రి దేవాలయాన్ని నిర్మించిన విధంగానే స్తపతులను తీసుకొచ్చి ఆధ్యాత్మిక, అత్యాధునిక హంగులతో ఆలయాన్ని నిర్మిస్తామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం 384 ఎకరాలను మంజూరు చేస్తామన్నారు కేసీఆర్. జగిత్యాలలో జరిగిన టిఆర్ఎస్ బహిరంగ సభలో ఈ విషయాలన్నీ కూడా తెలిపారు సీఎం. సీఎం కేసీఆర్ ప్రకటనతో అంజన్న భక్తులు సంబరపడుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఆలయం ఉన్నా అత్యధిక మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఆలయం మరింత అభివృద్ధి చెందితే మరింత మంది భక్తులు ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది.
