katrina Kaif : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ముంబైలో జరిగిన నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2022 కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. సిల్వర్ కలర్ నూడుల్ స్ట్రాప్ బాడీ-హగ్గింగ్ సీక్విన్ గౌను వేసుకుని ఆమె రెడ్ కార్పెట్ పైన రాక్ చేసింది. రెడ్ కార్పెట్ పైన ఈ బ్యూటీ స్టైల్‌గా నడుస్తూ తన ఫ్యాబ్ ఫిగర్‌ని ప్రదర్శించింది ఫ్యాన్స్ ను ఫిదా చేసింది . అయితే ఆమె పొట్ట కొద్దిగా ఉబ్బినట్లు ఉండటంతో ఆమె గర్భవతి అని ఆమె అభిమానులు ఉహించుకుంటున్నారు .

కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి గర్భవతిగా కనిపిస్తుందని ఆమె ట్రోల్ చేయబడుతోంది . కానీ ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నటి వేసే ప్రతి అడుగును గమనించే భారీ అభిమానులు ఉన్నారు . ఈ క్రమంలో ఈ దివా శుభవార్త ను ఎప్పుడు ప్రకటిస్తారని వారు వేచి చూస్తున్నారు.

ఇక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే కత్రినా చివరిగా ఫోన్ భూత్ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి కనిపించింది. ఒకవైపు బాలీవుడ్‌లో నటిగా తన సత్తా ఏంటో నిరూపించుకుంటూనే, ఇండస్ట్రీకి తన ఫ్యాషన్ స్టైల్స్ ను కూడా చూపించింది కత్రినా . ఫ్యాషన్ విషయానికి వస్తే ఆమెకు ప్రత్యేకమైన సార్టోరియల్ ఎంపికలు ఉన్నాయి. ఈ బ్యూటీ ఎప్పటికి అత్యద్భుత మైన అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
