Katrina Kaif : చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో తళుక్కుమంది. నటులు సిద్ధాంత్ చతుర్వేది, ఈషాన్ ఖత్తర్ తో కలిసి ఫోన్ బూత్ ట్రైలర్ లాంచ్ కి హాజరైంది. ఈ ఈవెంట్ కోసం కత్రినా కైఫ్ చిక్ ఫ్లోరల్ ప్రింటెడ్ పవర్ సూట్ ను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

Katrina Kaif : నటి కత్రినా కైఫ్ , సిద్ధాంత్ చతుర్వేది, ఈషాన్ ఖత్తర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఫోన్ బూత్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు గ్రాండ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్ . ఈవెంట్ ప్రమోషన్ కోసం కత్రినా కైఫ్ స్పెషల్ లుక్ లో కనిపించింది . కత్రినా ఫ్లవర్ అవుట్ ఫిట్ తో ఈవెంట్ కు పవర్ ని తీసుకొచ్చింది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కత్రినా. ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక ఈరోజు విడుదల అయిన ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో పెళ్లైన తర్వాత కత్రినా కైఫ్ నటిస్తున్న మొదటి సినిమా ఫోన్ భూత్. ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ మూవీలో కత్రినా ఒక దయ్యంలా కనిపించబోతోంది. మూవీకి హైప్ తీసుకొచ్చేందుకు ప్రమోషనల్ ఈవెంట్లతో కత్రినా అదరగొట్టేస్తోంది. పింక్ అండ్ గ్రీన్ ఫ్లోరల్ పాటర్న్ తో వచ్చిన బ్లాక్ అవుట్ ఫిట్ లో కత్రినా బాస్ బేబీ లుక్ లో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.

నాచ్ లేపెల్ కాలర్స్ తో వచ్చిన ఫుల్ లెన్త్ స్లీవ్స్ తో ఉన్న కో ఆర్డ్ బ్లేజర్ ను దానికి మ్యాచ్ అయ్యే హై రైస్ వేస్ట్ ప్యాంట్ సెట్ ను వేసుకుంది కత్రినా. పింక్ అండ్ గ్రీన్ రంగుల్లో రోజా పూల పాటర్న్స్ ని ఈ కో ఆర్డ్ సెట్ మొత్తం అందించారు డిజైనర్లు. న్యూడ్ కలర్ ట్యాంక్ టాప్ వేసుకొని తన లుక్ ని పూర్తి చేసింది కైఫ్.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా పాదాలకు న్యూడ్ పాయింటెడ్ హై హీల్స్ వేసుకుంది . చేతివేళ్ళకు స్టేట్మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. చెవులకు గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్ అలంకరించుకుని, తన కురులతో మధ్య పాపిట తీసుకొని లూస్ గా వదిలింది కత్రినా. పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్, కనులకు సబ్టిల్ ఐ ష్యాడో , బ్లాక్ ఐ లైనర్ , మస్కరా వేసుకుని గ్లామరస్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది.
