Katrina Kaif: హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా పలు సినిమాలు చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన “మల్లీశ్వరి”, బాలకృష్ణ “అల్లరి పిడుగు” సినిమాలు చేయడం జరిగింది. ఈ రెండిటిలో వెంకటేష్ తో చేసిన “మల్లీశ్వరి” పరవాలేదు అనిపించింది.
ఇదిలా ఉంటే ఇటీవల తమిళనాడులో మధురై లోని మౌంటెన్ వ్యూ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కత్రినా కైఫ్ స్కూల్ పిల్లలతో డాన్స్ చేయడం జరిగింది. “బీస్ట్” సినిమాలోని “అరబిక్ కుతు” సాంగ్ కి పిల్లలతో చిందులేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఇమేజ్ కరిగిన కత్రినా కైఫ్ ఇలా సామాన్య పిల్లలతో కలిసి డాన్స్ చేయడం పట్ల నేటిజన్ లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
పేద విద్యార్థులకు అత్యుత్తమ ఇంగ్లీష్ విద్యా విధానం అందించే దిశగా ఈ పాఠశాల సేవలు అందిస్తూ ఉంది. పైగా ఈ పాఠశాలలో కత్రినా కైఫ్ తల్లి సుజనెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ స్కూల్ లో ఆమె కొన్నాళ్లపాటు విద్యార్థులకు పాఠాలు చెప్పారు. 2020లో మరిన్ని తరగతి గదులు నిర్మించాల్సిన పరిస్థితి ఉండటంతో కత్రినా కైఫ్ అప్పట్లో విరాళాలు కూడా అడగడం జరిగింది. తాజాగా పేద పిల్లలతో కత్రినా కైఫ్ డాన్స్ చేసిన వీడియో భారీ వ్యూస్ తో వైరల్ అవుతుంది. మేరీ క్రిస్మస్, ఫోన్ బూత్, టైగర్ 3 సినిమాలతో కత్రినా ప్రస్తుతం బిజీగా ఉంది.