కార్తీక్ గురించే ఆలోచిస్తూ బాధపడుతుంటుంది దీప. ఎలాగైనా కార్తీక్ పట్టుకోవాలని వెతకడానికి బయటికి వెళుతుంది. అలాగే.. డాక్టర్ అన్నయ్య, ఆయన తల్లి చూపే ప్రేమని చూసి ఏం జన్మబంధమో అనుకుంటుంది. మరోవైపు సౌర్య ఆటో నడుపుతూ అమ్మనాన్నని వెతకాలని డిసైడ్ అవుతుంది. అనంతరం వెతుకుతూ బయటికి వెళుతుంది. ఆ తర్వాత ఆగస్టు 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
కార్తీక్ ఫొటో పట్టుకుని పార్క్‌లో దీప కనపడ్డా అందరినీ అడుగుతూ ఉంటుంది దీప. అదే సమయంలో మరో వ్యక్తి కూడా కార్తీక్‌ని వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికిన, ఎంతమందిని అడిగిన తెలియదని చెప్పడంతో బాధగా ఓ చోట నిలుచుని ఉంటుంది దీప. అదే సమయంలో కార్తీక్ ఫొటో పట్టుకుని ఓ చెయ్యి ఆమె ముందుకి వస్తుంది. అది చూసిన దీప ఆ వ్యక్తిని పరిశీలనగా చూసి షాకవుతుంది. అది మరేవరో కాదు. మన లేడీ విలన్ మోనిత. వెంటనే దీపకి ఆవేశం వచ్చి మోనిత గొంతుపట్టుకోగా విడిపించుకుంటుంది మోనిత. అనంతరం నువ్వు బతికే ఉన్నావా అని షాకై అడుగుతుంది దీపని మోనిత. ‘అవును.. నా భర్త ఎక్కడా.. ఎక్కడా దాచావు’ అని అరుస్తూ అడుగుతుంది దీప. దాంతో.. ‘కార్తీక్ నా దగ్గరే ఉంటే ఇలా పిచ్చిదానిలా ఫొటో పట్టుకుని తిరుగుతానా. నా కార్తీక్ బతికుండాలని ఎంత తపస్సు చేశానో తెలుసా. అలాంటిది ఆయన నా దగ్గర ఉండడం ఏంటి’ అని ప్రశ్నిస్తుంది. దానికి.. ‘నా డాక్టర్ బాబుని తీసుకెళ్లే అవసరం నీకు తప్ప ఎవరికీ లేదు. ఎందుకు నాటకాలు ఆడుతున్నావు. నిన్న ఆసుపత్రికి వెళ్లి అడిగితే ఎవరో భార్య అని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అది నువ్వు కాదా. కాకుంటే మరేవరూ’ అంటుంది దీప అనుమానంగా. ‘అంటే కార్తీక్ బతికే ఉన్నాడా. ఎక్కడా ఉన్నాడు. అయినా నీకు కనిపించట్లేదు. నాకు కనిపించట్లేదు. అంటే మరెక్కడా ఉన్నాడు’ అని బాధపడుతూ వెతకుతూ వెళ్లిపోతుంది మోనిత.
అనంతరం.. అమ్మనాన్న యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది హిమ. అది చూసి సౌందర్య ‘పరిస్థితి ఇలా అయ్యిందేంటి. కొడుకు, కోడలు దూరమయ్యారు. మనవరాళ్లు ఇలా అయిపోయారు’అని మనసులో మదన పడుతుంది. అనంతరం ఏడుస్తున్న హిమ దగ్గరకి వెళ్లి.. ‘మీ అమ్మనాన్న చనిపోయారు. వాళ్లు ఇక రారు. అది నమ్ము. సౌర్య ఎక్కడ ఉందో లేదో తెలియదు. వెతికిన అది వస్తుందో రాదో తెలియదు. కాబట్టి అన్ని వదిలేసి మర్చిపో’ అంటుంది సౌందర్య. అది విని.. ‘మర్చిపో అంటే ఎలా మర్చిపోతుందా.. నువ్వు మర్చిపోయావా.. నేను మర్చిపోయానా.. అయినా మనం వెతకడానికి వెళదామని చెప్పా కదా. బాధపడకు’ అని హిమని ఓదార్చుతాడు. అది విని.. ‘ఎక్కడికి వెళతారు. వెతకడానికి వెళ్లిన మీకు వాళ్లు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్‌కి వెళదామంటారు. మీ ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది’ అని ఆవేదనగా అంటుంది సౌందర్య.
అనంతరం.. కారులో నుంచి దిగి డోర్‌ని గట్టిగా తంతాడు కార్తీక్. అది చూసి జాగ్రత్తలు చెబుతాడు శివ. అది విని.. ‘మీ మేడమ్ చాలా ఎక్కువ చేస్తోంది. ఇవ్వని చూస్తుంటే ఆమె నా పెళ్లం కాదెమోనని అనిపిస్తుంది. లేకపోతే.. ఏ పెళ్లమైనా ఏవండి.. అక్కడికి వెళ్లండి.. మార్కెట్ కూరగాయలు తెండని అంటుంది. కానీ.. ఇలా అక్కడికి వెళ్లొద్దు. ఇక్కడికి వెళ్లొద్దని హద్దులు పెట్టదు’ అంటాడు కార్తీక్ కోపంగా. ఇంతలోనే శివకి మేడమ్ కాల్ చేసి కార్తీక్ గురించి ఆరా తీస్తూ ఉంటుంది. అలా కొద్ది నిమిషాల వ్యవధిలోనే చాలాసార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. దాంతో వాకింగ్‌కి వచ్చిన కార్తీక్ వెనుదిరిగిపోతాడు.
మరోవైపు.. ఇంట్లో ఉన్న కార్తీక్, దీప ఫొటోలను చూస్తూ బాధపడుతూ ఉంటుంది సౌందర్య. ‘మీ బిడ్డలను సరిగా చూడలేకపోతున్నా. సౌర్యని తీసుకొచ్చే వరకూ హిమ ఊరుకోదు. హిమ ఉంటే సౌర్య రాదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు’ అని బాధగా అంటూ ఉంటుంది. దాంతో ఈ ఎపిసోడ్‌కి శుభం కార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. దీప కారులో మోనిత ఇంటికి వెళుతుంది. తన దగ్గరే కార్తీక్‌ని ఉంచుకుని లేడని నాటకం ఆడుతుందని.. ఆమె చంపేసైనా తీసుకెళతా అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి ఏదో చూసి షాక్ అవుతుంది. అసలేం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.